Skip to main content

Jagananna Vidya Kanuka: ఇక మరింత మెరుగ్గా..

రాష్ట్రంలో Jagananna Vidya Kanuka కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Jagananna Vidya Kanuka
జగనన్న విద్యా కానుక ఇక మరింత మెరుగ్గా..

నిర్ణీత ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ దష్టి సారించింది. జగనన్న విద్యా కానుక వస్తువులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అక్కడక్కడ తలెత్తిన చిన్న చిన్న లోపాలు కూడా భవిష్యత్తులో ఉండకుండా చూసుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ మరింత నాణ్యమైన వస్తువుల పంపిణీకి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది. 

చదవండి: Jagananna Vidya Kanuka: ఏడాది ముందు నుంచే ఏర్పాట్లు.. కిట్ల క్యాలెండర్ ఇలా..

ఏటేటా పెరుగుతున్న నాణ్యత 

  • రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు అందిస్తున్నారు. దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను పంపిణీ చేయిస్తున్నారు. 2020–21లో 42,34,322 మంది విద్యార్థులకు రూ.648.10 కోట్లతో, 2021–22లో 45,71,051 మందికి రూ.789.21 కోట్లతో, 2022–23లో 4,740,421 మందికి రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుకను అందించారు. మూడేళ్లలో ఈ వస్తువుల కోసం రూ. 2,368.33 కోట్లు వెచ్చించారు.
  • అయితే వేలాది స్కూళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కావడంతో క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు విద్యా శాఖ అధికారులు పరిష్కరిస్తున్నారు. మౌలికమైన అంశాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటినీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు.
  • ఇలా ఏటేటా ఈ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తాజాగా వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇకపై మరింత నాణ్యమైన వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చదవండి: విద్యావ్యవస్థపై భారీ వ్యయం.. 9 రకాల కార్యక్రమాలు ఇవే..

ఇకపై మార్పులు ఇలా..

  • అన్ని ఊళ్లలో ఒక్కో తరగతిలో ఒకరో ఇద్దరో పిల్లలు లావుగా ఉండొచ్చు. వారికి యూనిఫాం క్లాత్‌ సరిపోకపోయి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి వారిని దష్టిలో ఉంచుకుని అందరికీ సరిపడా రీతిలో మూడు జతల యూనిఫారం క్లాత్‌ ఇచ్చేందుకు చర్యలు.
  • కుట్టు కూలీ మరింత పెంచి ఇచ్చే విషయమూ విద్యా శాఖ పరిశీలన చేస్తోంది.
  • బ్యాగుల పరిమాణంపై నిపుణుల సూచనల మేరకు మార్పులు చేయిస్తోంది. 1–5 తరగతుల విద్యార్థులకు మీడియం సైజు, 6–10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు అందించనున్నారు. ఈసారి బ్యాగు వెడల్పు పెంచనున్నారు.
  • బ్యాగులో నోట్‌బుక్కులు, పాఠ్య పుస్తకాలు అన్నీ పట్టేలా కొత్త టెండర్‌లో స్పెసిఫికేషన్లు సవరించనున్నారు.
  • పిల్లల షూ సైజులను తీసుకొనేందుకు మండల స్థాయిలో ఆయా కంపెనీల ద్వారా షూ మేళాలు నిర్వహించేలా చేయడమో, లేదా కూపన్లు అందించి ఆయా కంపెనీల దుకాణాలలో వాటిని రీడీమ్‌ చేసుకొని షూలు పొందేలా చేయడమో చేయాలని ప్రతిపాదించారు.
  • విద్యా కానుక పంపిణీలో జాప్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా ఇప్పటి నుంచే విద్యా శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బడ్జెట్‌ ఎస్టిమేట్లను త్వరగా పూర్తి చేసి ఆర్థిక అనుమతులు పొందడం, టెండర్‌ డాక్యుమెంట్లు ఫైనల్‌ చేయడం, టెండర్లను పిలవడం, కంపెనీల ఎంపిక, వర్కు ఆర్డర్ల జారీ, ఒప్పందాలు చేసుకోవడం వంటివి ఈ ఏడాది నవంబర్‌ చివరికల్లా ముగించాలని భావిస్తున్నారు.
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదటి వారానికి జిల్లా.. మండల స్థాయికి ఆయా వస్తువులను చేర్చడం. ఏప్రిల్‌ 15 నాటికి కిట్ల రూపంలో వాటిని సిద్ధం చేయడం. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేయించడం. వచ్చే ఏడాది విద్యా కానుక అమలు కోసం రూ.958.34 కోట్లు అవసరమవుతాయని విద్మాయ శాఖ అంచనా వేసింది.

2023–24లో జగనన్న విద్యా కానుక అంచనా

కేటగిరీ

విద్యార్థులు

వస్తువులు

నిధులు (రూ.కోట్లలో)

నోట్‌బుక్స్‌ (6–10 తరగతులు)

23,11,951

2,40,92,886

1,04,80,40,541

బెల్టులు

29,56,188

29,56,188

10,34,66,580

(1–10 బాలురు, 1–5 బాలికలు)

షూలు

41,38,322

41,38,322

82,76,64,400

బ్యాగులు (1–5)

18,26,371

18,26,371

47,41,25,911

బ్యాగులు (6–10)

23,11,951

23,11,951

62,74,63,501

యూనిఫారం వస్త్రం (9–10)

9,34,521

––

1,36,79,79,875

డిక్షనరీ (1–5)

3,07,251

3,07,251

2,13,44,726

డిక్షనరీ (6–10)

4,56,393

4,56,393

7,66,74,024

టెక్టŠస్‌ బుక్స్‌ (1–8)

32,03,801

2,82,28,176

1,22,56,67,402

టెక్టŠస్‌ బుక్స్‌ (9–10)

9,34,521

79,75,590

51,12,35,319

వర్కు బుక్స్‌ (1–5)

18,26,371

1,55,94,375

54,79,86,337

Published date : 10 Oct 2022 05:15PM

Photo Stories