Skip to main content

Breaking News: అన్ని పరీక్షలు వాయిదా

OU పరిధిలోని అన్ని కళాశాలలకు జూలై 14 నుండి 16 వరకు సెలవులు ప్రకటించిందని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు.
Exams Postponed
అన్ని పరీక్షలు వాయిదా

తెలంగాణ‌ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా CM KCR విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు పోడిగిచినందున OUలో జరగనున్న వివిధ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలతో పాటు పీజీ ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ తేదీలు, ఇతర వివరాలకు విద్యార్థులు రోజూ ఓయూ వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు. జూలై 18 నుండి ఇతర పరీక్షలు అసలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి.

చదవండి: 

Published date : 13 Jul 2022 05:11PM

Photo Stories