Skip to main content

TS ECET 2022 Postponed: టీఎస్ ఈసెట్ ప‌రీక్ష వాయిదా.. ఎంసెట్ మాత్రం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో అనూహ్యంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా జూలై 13వ తేదీన‌(బుధ‌వారం) జరగాల్సిన ఈసెట్‌ను వాయిదా వేశారు.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి

ఈ మేర‌కు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈసెట్‌ మళ్లీ ఎప్పుడు నిర్ణయించాలనే విషయాన్ని తర్వ‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ప్రొఫెసర్‌ లింబాద్రి పేర్కొన్నారు. జూలై 14వ తేదీన‌(గురువారం) జరగాల్సిన టీఎస్ ఎంసెట్ మాత్రం యథాతథంగా జ‌రుగుతుంద‌ని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ జ‌ర‌గనున్న‌ది. ఈ షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని ప్రొఫెసర్‌ లింబా స్పష్టం చేశారు. ఒక వేళ వాయిదా వేస్తే ఆన్‌లైన్ పరీక్షలకు షెడ్యూలు ఖరారు చేయడం కష్టమన్న ఉద్దేశంతోనే యథాతథంగా కొనసాగించానున్నారు. తెలంగాణ‌లో జూలై 13వరకు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విష‌యం తెల్సిందే.

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఎంసెట్ విపరీతమైన పోటీ.. కానీ TS EAMCET 2022
ఈసారి తెలంగాణ ఎంసెట్‌కు కూడా విపరీతమైన పోటీ ఉంది. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వ‌చ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా..
ఎంసెట్ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా విద్యుత్, ఇంటర్నెట్‌ సదుపాయాలు తప్పకుండా ఉండాల్సిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు మౌలిక సదుపాయాలకు అంతరాయం ఏర్పడే అవ‌కాశం ఉంది. బేటరీలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల సాయంతో పరీక్షలు నిర్వహించినా, చాలామంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవడమే కష్టంగా ఉందని అంటున్నారు. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published date : 11 Jul 2022 07:48PM

Photo Stories