BSc Food Sciences: సబ్జెక్టు టాపర్‌గా ఐశ్వర్య
Sakshi Education
కొడంగల్: తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం కోటిలో బీఎస్సీ గ్రూప్ ఫుడ్ సైన్స్‌లో సబ్టెక్టు టాపర్‌గా కొడంగల్ విద్యార్థిని బాకారం ఐశ్వర్య ప్రతిభ చూపింది.
ఈ సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ విద్యులత, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, నగదు అవార్డును అందుకున్నారు.
చదవండి: New Courses for Students: నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులు
విద్యార్థిని ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా వంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి తాపస్, మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి శోభమ్మ, కొడంగల్ మున్నూరు కాపు సంఘం నాయకులు శంకరప్ప, అనంత ప్రసాద్, బిచ్చప్ప, నర్సిరెడ్డి, శ్యాంసుందర్, ఓం ప్రకాశ్, నరేష్‌లు అభినందించారు.
Published date : 11 Oct 2023 02:42PM