Skip to main content

DOST: ‘దోస్త్‌’కు 68 వేల ఆప్షన్లు

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పటివరకూ దోస్త్‌కు 83,611 దరఖాస్తులు అందాయని ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.
DOST
‘దోస్త్‌’కు 68 వేల ఆప్షన్లు

మొత్తం 1,10,334 మంది డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (DOST)కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు స్పష్టం చేశారు. వీరిలో 68,178 మంది వివిధ కోర్సులు, కళాశాలలకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకూ దోస్త్‌కు దరఖాస్తు చేసేందుకు, ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్‌లైన్‌ ద్వారానే చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే దివ్యాంగులు జూలై 28వ తేదీన, NCC, ఇతర అర్హతలున్న వారు 29వ తేదీన నిర్దేశిత కౌన్సెలింగ్‌ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలనకు స్వయంగా హాజర వ్వాల్సి ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్య మండలి పేర్కొంది. 

చదవండి: 

 

Published date : 27 Jul 2022 03:25PM

Photo Stories