Skip to main content

ఇకపై అకడమిక్‌ సిలబస్‌గా పాఠ్యపుస్తకాలకు ఎక్కనున్న ఎన్‌సీసీ

గుణదల (విజయవాడ తూర్పు): క్రమశిక్షణ, దేశ భక్తికి మారుపేరైన ఎన్‌సీసీ (నేషనల్‌ క్యాడెట్‌ కారప్స్‌) ఇకపై అకడమిక్‌ సిలబస్‌గా పాఠ్యపుస్తకాలకు ఎక్కనుందని 17 ఆంధ్రా బెటాలియన్‌ ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ పి.మధుసూదనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్‌సీసీ హెడ్‌ క్వార్టర్స్‌ న్యూఢిల్లీ అధికారులు దీనిపై పలు యూనివర్సిటీలతో చర్చించారని, ఆయా యూనివర్సిటీలు ఆమోదం తెలపడంతో ఎన్‌సీసీ అకడమిక్‌ సబ్జెక్ట్‌గా విద్యార్థులకు అందుబాటులోకి రానుందని వివరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 397 కళాశాలలు ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ పరిధిలో ఉన్నాయని వివరించారు.
Published date : 17 May 2021 01:01PM

Photo Stories