Madhu Bangarappa: 500 కేపీఎస్ పాఠశాలల అప్‌గ్రేడ్
మార్చి 6న తాలూకాలోని మాస్తి గ్రామ బస్టాండు వద్ద రూ.2.50 కోట్ల వ్యయంతో నూతన బస్టాండు నిర్మాణ పనులకు భూమిపూజ, ఒసాట్ సంస్థ ఆధ్వర్యంలో మాస్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన తరగతి గదుల నిర్మాణ పనులను నెరవేర్చి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రగతికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో 8వ తరగతి నుంచి మాత్రమే కోడిగుడ్డు అందించేదన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి తాము 1 నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థులకు కోడిగుడ్డు అందిస్తున్నామన్నారు.
చదవండి: TS Mega DSC 2024: ఈ అర్హతలు ఉంటేనే ఎస్‌జీటీ పోస్టులుకి దరఖాస్తు చేయాలి
విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామ పంచాయతీకి ఒకటి ప్రకారం సుమారు 3 వేల పాఠశాలను దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేపీఎస్ పాఠశాలలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. విద్యార్థులు పాఠశాలల్లో కన్నడ, ఇంగ్లిష్ మీడియంల్లో దేన్నయినా చదవవచ్చన్నారు.
పాఠ్యపుస్తకాల పునః రచన చేయాలనే ఒత్తిడి ఉంది. ఇది పిల్లల విద్యాభ్యాసంపై ప్రభావం చూపకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో 12,500 మంది ఉపాధ్యాయులను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంజేగౌడ, ఎమ్మెల్సీ ఎంఎల్ అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.