OU దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ దూరవిద్య కేంద్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2024–25) నుంచి పలు డిగ్రీ కోర్సులకు సెమి స్టర్ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి సెప్టెంబర్ 25న తెలిపారు.
సెమిస్టర్ పరీక్షల వలన ఏటా రెండు చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి ఆరు పరీక్షలుంటాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పీజీ, పీజీ డిప్లొమా కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: TS TET 2023: టెట్ ఫలితాలు విడుదల తేదీ ఇదే..
ఇదిలా ఉండగా 2023–24 విద్యా సంవత్సరానికి పలు పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సుల మొదటి విడత ప్రవేశాల దరఖాస్తుల స్వీకరణ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఇంత వరకు 4 వేల మంది విద్యార్థులు పలు కోర్సుల్లో ప్రవేశం పొందినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు.
Published date : 26 Sep 2023 11:59AM