Skip to main content

'IGNOU' పరీక్షలు తేదీలు ఇవే..

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే డిసెంబర్- 2023 టర్మ్ ఎండ్ పరీక్షలు డిసెంబర్ మొదటి తేదీ నుంచి జరగ నున్నాయని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత తెలిపారు.
IGNOU Winter Session Exams 2023 Details  IGNOU exam dates   Latest News: IGNOU Exams Starting December 1, 2023

జనవరి తొమ్మిదో తేదీ వరకూ ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, ఆదోని, అనంతపురం ప్రాంతాల్లో పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన అభ్య ర్థులందరికీ హాల్ టికెట్స్న ఇగ్నో వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచామని తెలిపారు.

చదవండి: IGNOU: ఇగ్నోలో ప్రవేశాలకు మరో అవకాశం

ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తమతమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీ క్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866-2565253 లో సంప్రదించవచ్చన్నారు.

Published date : 30 Nov 2023 12:52PM

Photo Stories