UPSC Civils Ranker Success Story : ఆ బాధను దిగమింగుకొని.. సివిల్స్ కొట్టానిలా.. కానీ..
డాక్టర్ కావడం అతడి కల. కానీ తాను చదువుతున్న చోటుకు ఓ ఐఏఎస్ రావడంతో అప్పుడే అతని ఆలోచన సివిల్స్ వైపు మళ్లింది. ఆ దిశగా ప్రిపేర్ అవుతున్న క్రమంలో అమ్మ అనారోగ్యం బారిన పడటంతో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా పట్టు విడవ లేదు. బాధను దిగమింగుకొని తల్లిదండ్రులు, తమ్ముడి సహకారంతో మళ్లీ ప్రిపరేషన్ మొదలెట్టాడు. చివరికి ఆరో ప్రయత్నంలో 550వ ర్యాంకుతో మెరిశాడు. ఈ నేపథ్యంలో రేపూడి నవీన్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణం. మా నాన్న రేపూడి జయపాల్. ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మా అమ్మ విజయలక్ష్మి, మా అమ్మ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. తమ్ముడు వినయ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో సెటిల్ అయ్యాడు.
➤ Sirisha, SI : నన్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..
ఎడ్యుకేషన్ :
నా ప్రాథమిక విద్య జగ్గయ్యపేటలో గుంటూరు పబ్లిక్ స్కూల్ పదో తరగతి వరకు చదివాను. విజయవాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. వైద్య విద్య చివరి సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉండటంతో అప్పుడే విజయవాడ సబ్ కలెక్టర్‌గా వచ్చిన డా.సలోమి సబానా హాస్పిటల్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆమె కూడా అంతకుముందు డాక్టర్ కావడంతో ఆమెను చూసి స్ఫూర్తి పొందాను. ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చని భావించి ఎంబీబీఎస్ వదిలేసి సివిల్స్ వైపు వచ్చాను.
➤ Nagalakshmi: కూలి పనులు చేస్తూ..చదివా..నా జీవితాన్ని మార్చింది ఇదే..
నా ప్రిపరేషన్ ఇలా..
ఢిల్లీలోని వాజిరాం ఐఏఎస్ అకాడమీలో సంవత్సరం పాటు కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత సొంతంగా ప్రిపరేషన్ కొనసాగించాను. హైదరాబాద్‌లోని విష్ణు ఐఏఎస్ అకాడమీలో టెస్ట్ సిరీస్ తీసుకొని ఫాలో అయ్యాను. రోజూ 6-8 గంటలు చదివాను. ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. NCERT బుక్స్ చాలా ఉపయోగపడ్డాయి.
➤ DSP Yegireddi Prasad Rao : ఆయన కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..
ఎన్నో ఎత్తుపల్లాలు.. చివరికి
యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రిపరేషన్‌లో ఇంటర్నెట్, యూట్యూబ్ మెయిన్ పార్ట్ అయిపోయింది. చాలావరకు మెటీరియల్ ఇంటర్నెట్‌లోనే లభ్యమవుతుంది. ఒత్తిడిని మర్చిపోవడానికి క్రికెట్, టెన్నిస్ ఆడాను. మూడో ప్రయత్నంలో ఉన్నప్పుడు అమ్మ అనారోగ్యంతో ఉండగా ప్రిపరేషన్ ఆపేశాను. అనంతరం మళ్లీ చదివాను. గతంలో ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు నాలుగుసార్లు వెళ్లాను. ఇంటర్వ్యూకు రెండుసార్లు హాజరయ్యాను. చివరికి ఆరో ప్రయత్నంలో సాధించాను.
నా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే..
నా ఇంటర్వ్యూ సుమారు 25 నిమిషాలు సాగింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే లాభమా, నష్టమా? హెలికాప్టర్‌కు పైన రెక్కలతో పాటు వెనకాల రెక్కలు ఎందుకుంటాయి.. వాటి మెకానిజమ్ ఏంటి? ఆర్బీఐ కరెన్సీ ముద్రణ వంటి విషయాలతో పాటు ఇతర ప్రశ్నలు అడిగారు.
➤ Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..
నిత్యం బ్రేక్‌ఫాస్ట్ ఎలాగో..
సివిల్స్ వైపు రావాలనుకుంటే ముందే ప్రిపరేషన్ ఉండాలి. అప్పటికప్పుడు చదివి రాసే పరీక్ష కాదు కాబట్టి ముందుచూపు తప్పనిసరి. రోజూ కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించడం ఉత్తమం. నిత్యం బ్రేక్‌ఫాస్ట్ ఎలాగో దినపత్రికలు చదవడం అలా అలవాటు చేసుకోవాలి. ఆప్షనల్స్ రెండు రకాలు ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌పై పట్టు ఉందనుకుంటే అదే ఎంచుకోవాలి. లేదంటే ఆసక్తిని బట్టి సోషియాలజీ, ఆంత్రోపాలజీ వంటివి ఎంచుకోవచ్చు.
➤ Shiva Kumar goud, DSP: ఆ ఒకే ఒక్క మార్కే..నా జీవితాన్ని మార్చిందిలా..
Tags
- repudi naveen upsc civils 550 ranker
- rupudi naveen civils ranker success story
- rupudi naveen civils ranker education
- rupudi naveen civils ranker family
- rupudi naveen civils ranker real story
- UPSC
- UPSC jobs
- UPSC Recruitment
- UPSC Civils Interviews
- UPSC Civils Ranker Success Story
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- GoalAchievement
- SuccessJourney
- RepudiNaveen
- Sakshi Education Success Stories