Skip to main content

Sreedhanya Suresh,IAS: మా అమ్మ‌,నాన్న రోజువారీ కూలీలే.. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లాడానికి డ‌బ్చు లేక‌..

కేరళ వయనాడ్‌కు చెందిన గిరిజన యువతి శ్రీధన్య సురేశ్‌ సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకున్నారు.
Sreedhanya Suresh, IAS
శ్రీధన్య సురేశ్‌, ఐఏఎస్‌

కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక సర్వీసుకు ఎంపికైన తొలి గిరిజన యువతిగా ఆమె గుర్తింపు పొందారు.

ముఖ్యమంత్రి సేతం..

Rahul Gandhi

 

Priyanka Gandhi

22 ఏళ్ల శ్రీధన్యకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2018 ఫలితాల్లో 410 ర్యాంకు సాధించింది. ‘ శ్రీధన్య కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్‌ ర్యాంకు తెచ్చిపెట్టాయి. కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్‌ ఆమెతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో ‘ తన సామాజిక వెనకబాటుతో పోరాడి శ్రీధన్య సివిల్స్‌లో మెరిశారు. ఆమె విజయం భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం ఈ గిరిజన యువతిని మెచ్చుకున్నారు.

కుటుంబ నేప‌థ్యం : 

Family


కేరళలోని వయనాడ్ జిల్లా పొజుథానా అనే చిన్న‌ గ్రామానికి చెందిన కురిచియ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి శ్రీధన్య సురేశ్‌. అమ్మ కమల, నాన్న సురేశ్. ఇద్దరూ రోజువారీ కూలీలే. విల్లులు-బాణాలు తయారుచేస్తూ వాటిని దగ్గర్లోని మార్కెట్లో అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. మేం ముగ్గురు పిల్లలం. ఆ కొంత డబ్బుతోనే మా కుటుంబం గడిచేదంటే మా ఆర్థిక పరిస్థితేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడైనట్లుగా అమ్మానాన్నల రోజువారీ కూలీకి తోడుగా..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  కింద కొంత మొత్తం అందుతుంది. ఇక ప్రస్తుతం నా సోదరి ఓ గవర్నమెంట్‌ ఆఫీస్‌లో సర్వెంట్‌గా పనిచేస్తోంది. తమ్ముడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.

చ‌దువు : 
పేదరికం, నిత్యావసరాల కొరత మధ్య శ్రీధన్య తన చదువును కొనసాగించింది. ఆమె తన ప్రాథమిక విద్యను వాయనాడ్‌లో చేసాడు. తర్వాత కాలికట్ విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ జువాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగం వద్దనుకుని..
శ్రీధన్య సివిల్స్ మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చినా వదిలేసింది. కేరళ గిరిజన విభాగంలో ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ‘అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చారు.

ఈయ‌న స్ఫూర్తితోనే...

Inspirationచదువు పూర్తయిన తర్వాత శ్రీధన్య కేరళలోని షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖలో క్లర్క్‌గా పని చేసింది. వాయనాడ్‌లోని గిరిజన హాస్టల్ వార్డెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఒకసారి ఐఏఎస్ శ్రీరామ్ సాంబశివరావును కలిసింది. శ్రీధన్యకు కాలేజీ రోజుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌పై ఆసక్తి ఉండేది కానీ అప్పట్లో సరైన గైడెన్స్‌ లభించలేదు. కానీ ఐఏఎస్‌ శ్రీరామ్‌ సాంబశివరావు స్ఫూర్తితో సివిల్‌ సర్వీస్‌లో పాల్గొంది. మొదట గిరిజన సంక్షేమానికి చెందిన సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్న కోచింగ్‌లో చేరింది. తర్వాత చదువుకోవడానికి తిరువనంతపురం వెళ్లగా, షెడ్యూల్డ్ తెగల శాఖ ఆమె చదువుకు ఆర్థిక సహాయం కూడా చేసింది.

తొలిసారిగా ఓ ఐఏఎస్‌ అధికారిని అప్పుడే చూశా..
ఇక్కడ గిరిజన జనాభా చాలా ఉన్నా మా నుంచి ఒక్కరూ ఐఏఎస్‌కు ఎంపిక కాలేదు. నా విజయం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. నా పీజీ పూర్తయిన తరువాత తొలిసారి ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యక్షంగా చూశా. ఆయన కోసం ప్రజలు ఎదురుచూడటం, సిబ్బందితో ఆయన అక్కడికి రావడం సివిల్స్‌ సాధించాలన్న నా చిన్న నాటి కలను తట్టిలేపాయి’ అని శ్రీధన్య గుర్తుకుచేసుకున్నారు. ఆమె కాలికట్‌ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్‌ జువాలజీలో పీజీ చదివారు.

ఇంటర్వ్యూ కోసం..ఢిల్లీ వెళ్లాడానికి డ‌బ్చు లేకుంటే..

IAS Interview


ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీధన్య దగ్గర ఢిల్లీకి వెళ్లేంత డబ్బు లేదు. అయితే ఈ విషయం శ్రీధన్య స్నేహితులకు తెలియడంతో అందరూ విరాళాలు కలిపి రూ.40 వేల రూపాయలు వసూలు చేసి శ్రీధన్యను ఢిల్లీకి పంపించారు. శ్రీధన్య ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి కేరళ మొదటి గిరిజన అధికారిగా అద్భుతమైన చరిత్రను సృష్టించింది.

భవిష్యత్ తరాలు నన్ను ఆదర్శంగా..
కేరళలో అత్యంత వెనుకబడ్డ జిల్లా నాది.  అక్కడ ఎవరూ గిరిజన కులానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. నాకు ఇప్పుడు సివిల్స్ రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్ తరాలు నన్ను ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నానని శ్రీధన్య తెలిపారు.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

D.Roopa, IPS: ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఐపీఎస్‌..ఎక్క‌డైన స‌రే త‌గ్గ‌దేలే..

Published date : 04 Jan 2022 02:00PM

Photo Stories