Success Story : చదువులో టాపర్.. డ్యాన్స్‌లోనూ అదుర్స్.. ఈ యువ ఐఏఎస్‌ను చూస్తే..
పట్టణానికి చెందిన మంద మకరంద్ ఆలిండియా లెవల్‌లో 110వ ర్యాంకు దక్కించుకుని ఐఏఎస్‌కు అర్హత పొందాడు. 2019 సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి.., 2020 సంవత్సరంలో జరిగిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
IPS Success Story : ఎస్‌ఐ పరీక్షలో ఫెయిల్.. ఐపీఎస్ పాస్.. కానీ లక్ష్యం మాత్రం ఇదే..
కుటుంబ నేపథ్యం :
మంద మకరంద్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట స్వస్థలం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
రూ.30 లక్షల ప్యాకేజీ కాదనీ..
రూ.30 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పటికీ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేరై విజయం సాధించారు. పేదల వలసల నివారణకు చర్యలు చేపట్టడమే తన లక్ష్యమని వివరించారు. అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదల తోనే తాను సివిల్స్‌కు ఎంపికయ్యానని మకరంద్ తెలిపారు.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..
చదువులో టాపర్.. డ్యాన్స్‌లోనూ..
కాలేజీ రోజుల్లో ఈ యువ ఐఏఎస్ మకరంద్ చాలా యాక్టివ్ గా ఉండేవారు. రాజన్న సిరిసిల్ల కి చెందిన మంద మకరంద్ ఇటీవల జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అటు చదువులో శ్రద్ధ కనబరిచి టాప్ ర్యాంకులు సాంతం చేసుకుంటూ రాణిస్తూనే.. ఈయన డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఈయన ఇటీవల డ్యాన్స్ చేసిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...