Skip to main content

Civils Results: సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో అమ్మాయిలు స‌త్తా చాటారు.

ఎంద‌రో యువ‌తియువ‌కులు సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో ముందు స్థానంలో నిల‌వాల‌ని కష్ట‌ప‌డ‌తారు. కానీ, ఈసారి నిర్వ‌హించిన రాత ప‌రీక్ష‌ల్లో యువ‌తులు త‌న స‌త్తా చాటారు. మొద‌టి ప‌ది ర్యాంకుల‌లో యువ‌తుల సంఖ్యే ఎక్కువ‌గా ఉంది. అయితే, వారి ప‌రీక్ష‌కు సంబంధించి మార్కుల‌ను విడుద‌ల చేశారు. వాటి వివ‌రాల‌ను తెలుసుకుందాం....
Toppers in civil services exam results
Toppers in civil services exam results

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ 2022 పరీక్ష తుది ఫలితాలు (UPSC CSE 2022 Result) నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. తొలి నాలుగు ర్యాంకులనూ వారే సొంతం చేసుకున్నారు. ఇషితా కిశోర్‌ తొలి ర్యాంకులో మెరవగా.. గరిమా లోహియా, నూకల ఉమాహారతి, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో సత్తా చాటారు. సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి తెలంగాణ బిడ్డ కావడం విశేషం. ఆమెది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌. అలాగే, ఈసారి పరీక్షలో తెలుగు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులతో మెరిశారు. వందలోపు ర్యాంకుల్లో 10 మంది మనవాళ్లే ఉండటం.. అలాగే, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 46మందికి పైగా అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపిక కావడం మరో విశేషం.

Success Story: ఓకే సారి గ్రూప్‌-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌.. వీరి స‌క్సెస్ సిక్రెట్ చూస్తే..

ఈసారి 5.73లక్షల మంది అభ్యర్థులు సివిల్స్‌కు పోటీ పడగా..  ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ దశలు దాటుకొని  కేవలం 933మంది అభ్యర్థులే ఎంపికయ్యారు. సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థుల రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో వచ్చిన మార్కులను UPSC తాజాగా విడుదల చేసింది. మామూలుగా రాతపరీక్షకు 1750, ఇంటర్వ్యూకు 275 మార్కుల చొప్పున మొత్తంగా 2025 మార్కులకు గాను టాప్‌ 10 ర్యాంకర్లు సాధించిన మార్కులను ఓసారి పరిశీలిస్తే.. సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించిన ఇషితా కిశోర్‌కు రాత పరీక్షలో 901 మార్కులు; పర్సనాలిటీ టెస్టు(PT)లో 193 మార్కులు చొప్పున మొత్తంగా ఆమె 1094 మార్కులతో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులో నిలిచారు.

అలాగే, రెండో ర్యాంకర్‌ గరిమా లోహియా (ఓబీసీ) రాత పరీక్షలో 876 మార్కులు;  పర్సనాలిటీ టెస్టులో 187 చొప్పున మొత్తంగా 1063 మార్కులు సాధించారు. మూడో ర్యాంకర్‌ ఉమా హారతి (ఓబీసీ) రాత పరీక్షలో 873, పర్సనాలిటీ టెస్టులో 187 మార్కులు చొప్పున మొత్తంగా 1060 మార్కులతో మూడో ర్యాంకుతో మెరిశారు. నాలుగో ర్యాంకర్‌ స్మృతి మిశ్రాకు రాత పరీక్షలో 882 మార్కులు;  పర్సనాలిటీ టెస్టులో 173 మార్కుల చొప్పున మొత్తంగా 1055 మార్కులు సాధించారు.

Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

ఇకపోతే, సివిల్స్‌లో ఐదో ర్యాంకు సాధించిన మయూర్‌ హజారికాకు రాతపరీక్షలో 861, పీటీలో 193 చొప్పున మొత్తం 1054 మార్కులు వచ్చాయి. అలాగే, ఆరో ర్యాంకర్‌ గెహ్నా నవ్య జేమ్స్‌కు రాత పరీక్షలో 861, పీటీలో 193 చొప్పున మొత్తంగా 1054 మార్కులు వచ్చాయి. ఏడో ర్యాంకర్‌ వసీం అహ్మద్‌ భట్‌ రాత పరీక్షలో 871, పీటీలో  182 మార్కులతో మొత్తం 1053 మార్కులు సాధించారు.

ఎనిమిదో ర్యాంకర్‌ అనిరుధ్‌ యాదవ్‌కు రాత పరీక్షలో 856, పీటీలో 195 మార్కుల చొప్పున  మొత్తంగా 1051 మార్కులు వచ్చాయి. తొమ్మిదో ర్యాంకర్‌ కనికా గోయల్‌(ఈడబ్ల్యూఎస్‌)కు రాత పరీక్షలో 865 మార్కులు రాగా.. పర్సనాలిటీ టెస్టు(పీటీ)లో 180 మార్కుల చొప్పున మొత్తంగా 1045 మార్కులు సాధించారు. ఇకపోతే, పదో ర్యాంకు సాధించిన రాహుల్‌ శ్రీవాస్తవకు రాత పరీక్షలో 863 మార్కులు రాగా.. పర్సనాలిటీ టెస్టులో 180 మార్కుల చొప్పున మొత్తంగా 1043 మార్కులు వచ్చాయి.
 

Published date : 16 Sep 2023 10:40AM

Photo Stories