Skip to main content

UPSC Civil Service 2024 Notification: సివిల్స్‌ నోటిఫికేషన్ విడద‌ల‌.. ప్రిలిమ్స్‌లో రాణించేందుకు నిపుణులు మెలకువలు...

UPSC సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వారికి శుభవార్త.
UPSC Civil Services Examinations 2024 Notification

ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిబ్ర‌వ‌రి 14న‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారమే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ ఇచ్చింది.

UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు ఫిబ్ర‌వ‌రి 14 నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. 

అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు

రుసుము వివరాలు: రూ.100/- నగదు ద్వారా SBIలోని ఏదైనా బ్రాంచిలో డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడం ద్వారా. స్త్రీ/ SC/ ST/ PH అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎన్ని సార్లు రాయొచ్చంటే:

  • సాధారణ అభ్యర్థులు: 06
  • OBC అభ్యర్థులు: 09
  • SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు

పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది.

మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు
వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ).

ప్రిలిమినరీ పరీక్ష: పరీక్ష 200 మార్కుల రెండు తప్పనిసరి పేపర్‌లను కలిగి ఉంటుంది.

పేపర్ I: (200 మార్కులు)

GS Subject-wise Previous Questions with Key: Click Here 

వ్యవధి: రెండు గంటలు

సబ్జెక్ట్‌లు:

  • జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు.
  • భారతదేశ చరిత్ర మరియు భారత జాతీయ ఉద్యమం.
  • భారతీయ మరియు ప్రపంచ భూగోళశాస్త్రం-భౌతిక, సామాజిక, భారతదేశం మరియు ప్రపంచం యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రం.
  • భారత రాజకీయాలు మరియు పాలన-రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, ప్రజా విధానం, హక్కుల సమస్యలు మొదలైనవి.
  • ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి-సుస్థిర అభివృద్ధి, పేదరికం, చేరిక, జనాభా, సామాజిక రంగ కార్యక్రమాలు మొదలైనవి.
  • ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, బయో డైవర్సిటీ మరియు క్లైమేట్ చేంజ్‌పై సాధారణ సమస్యలు - సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అవసరం లేదు.
  • జనరల్ సైన్స్.

పేపర్ II: (200 మార్కులు)

వ్యవధి: రెండు గంటలు

సబ్జెక్ట్‌లు:

  • గ్రహణశక్తి;
  • కమ్యూనికేషన్ నైపుణ్యాలతో సహా వ్యక్తిగత నైపుణ్యాలు;
  • తార్కిక తార్కికం మరియు విశ్లేషణాత్మక సామర్థ్యం;
  • నిర్ణయం తీసుకోవడం మరియు సమస్య పరిష్కారం;
  • సాధారణ మానసిక సామర్థ్యం;
  • ప్రాథమిక సంఖ్యాశాస్త్రం (సంఖ్యలు మరియు వాటి సంబంధాలు, పరిమాణం యొక్క ఆర్డర్‌లు మొదలైనవి) (తరగతి X స్థాయి), డేటా వివరణ (చార్టులు, గ్రాఫ్‌లు, పట్టికలు, డేటా సమృద్ధి మొదలైనవి - క్లాస్ X స్థాయి);

గమనిక:

  • రెండు ప్రశ్నపత్రాలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
  • సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష జనరల్ స్టడీస్ పేపర్ - II కనీస అర్హత మార్కులతో 33%గా నిర్ణయించబడిన అర్హత పేపర్.
  • ప్రశ్నపత్రాలు హిందీ మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ సెట్ చేయబడతాయి.
  • తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్: అభ్యర్థులు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నాపత్రాల్లో తప్పు సమాధానాలు గుర్తించినట్లయితే ఉంటుందని అభ్యర్థులు గమనించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: మార్చి 05, 2024
  • పరీక్ష తేదీ: మే 26, 2024

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే | కరెంట్‌ అఫైర్స్‌

Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం 21 సర్వీసులకు యూపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మూడంచెల ఈ ఎంపిక ప్రక్రియలో తొలిదశ పరీక్ష ప్రిలిమ్స్‌ను మే 28వ తేదీన నిర్వహించనుంది. అత్యున్నత స్థాయి సర్వీసులైన సివిల్‌ సర్వీసులకు.. ఫ్రెషర్స్‌ నుంచి రిపీటర్స్‌ వరకు లక్షల మంది పోటీ పడుతుంటారు. ఇందుకోసం ఏళ్ల తరబడి కృషి చేస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పరీక్ష సమీపిస్తున్న నేపథ్యంలో.. సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో రాణించేందుకు నిపుణులు మెలకువలు...

సివిల్‌ సర్వీసెస్‌-2024 ద్వారా 21 సర్వీసుల్లో మొత్తం 1,056 పోస్ట్‌లకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తొలి దశ ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది పోటీ పడే అవకాశముంది. ప్రిలిమ్స్‌లో రాణిస్తేనే తదుపరి దశ మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. ఒక్కో పోస్ట్‌కు 1:12.5 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. అంటే.. తొలి దశకు ఆరు లక్షల మంది హాజరైతే.. రెండో దశకు అర్హత పొందేది 14వేల మంది మాత్రమే!ఈ జాబితాలో నిలవాలంటే.. ఎంతో అప్రమత్తంగా ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సమయ పాలనతో.. సక్సెస్‌

ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ప్రస్తుతం పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌లోని అన్ని అంశాలను నిత్యం చదివేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం ప్రిపరేషన్‌  పూర్తి చేసుకున్న తర్వాత సెల్ఫ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా ఉపకరిస్తుంది.

సమకాలీనంపై దృష్టి

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు సమకాలీన అంశాలపై అవగాహనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా సిలబస్‌లో పేర్కొన్న కోర్‌ టాపిక్స్‌ను కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ ఏడాది మే ముందు నుంచి ఏడాది, ఏడాదిన్నర కాలంలోని ముఖ్యమైన కరెంట్‌ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. నేపథ్యం,ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా వంటి కోణాల్లో విశ్లేషించుకోవాలి.

అనుసంధానం చేసుకుంటూ

అభ్యర్థులు ఎకానమీ-పాలిటీ, ఎకానమీ-జాగ్రఫీ, జాగ్రఫీ-ఎకాలజీ; జాగ్రఫీ-సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. ఫలితంగా ప్రిపరేషన్‌ పరంగా కొంత సమయం కలిసొస్తుంది. ఈ సమయాన్ని తమకు క్లిష్టంగా భావించే ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు వినియోగించొచ్చు.

ముఖ్యాంశాల పునశ్చరణ

సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యాంశాలను గుర్తించి.. వాటి­పై ప్రత్యేక దృష్టి సారించాలి.ఇప్పటికే సిద్ధం చేసుకు న్న సొంతనోట్స్‌ ద్వారా పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో ఆయా సబ్జెక్ట్‌ల నుంచి ఎలాంటి ప్ర­శ్నలు అడుగుతున్నారు..ఏ అంశాలకు అధిక ప్రాధా న్యం లభిస్తుందో గుర్తించాలి. వాటికి ప్రిపరేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. వాస్తవానికి ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. కాబట్టి ఇక నుంచి పూర్తిగా రివిజన్‌పై దృష్టిపెట్టాలి.

కొత్త అంశాలకు ఇలా

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు క్లిష్టంగా భావించిన అంశాలను తర్వాత చదవచ్చనే ధోరణితో విస్మరిస్తారు. ఇలా వదిలేసిన టాపిక్స్‌కు సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించడం సరికాదని సబ్జెక్ట్‌ నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత సమయంలో ఇప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత లోతైన అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త అంశాలను చదవాల్సి వస్తే.. వాటికి సంబంధించి సినాప్సిస్, కాన్సెప్ట్‌లపై దృష్టిపెట్టాలని పేర్కొంటున్నారు.

గత ప్రశ్న పత్రాల సాధన

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రిలిమ్స్‌ అభ్యర్థులకు ఉపకరించే మరో సాధనం.. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం. ఇప్పటి నుంచి పరీక్ష ముందు రోజు వరకు ప్రతి రోజు ఒక ప్రీవియస్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేసేలా సమయం కేటాయించుకోవాలి. దీని ద్వారా తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది.

పేపర్‌-2ను విస్మరించొద్దు

ప్రిలిమ్స్‌లో పేపర్‌-2ను అర్హత పేపర్‌గానే పేర్కొన్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్‌-1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగానే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. కాబట్టి పేపర్‌-2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్ర ధానంగా మ్యాథమెటిక్స్,లాజికల్‌ రీజనింగ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

ఇలా గుర్తుంచుకోవచ్చు

విస్తృతంగా ఉండే సిలబస్‌ అంశాలను గుర్తు పెట్టుకోవడం ఎంతో కష్టమైన పని. కాని వ్యక్తిగత మెమొరీ టిప్స్‌ ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్‌ టెక్నిక్స్‌ వంటి వాటిని అనుసరించాలి. ముఖ్యమైన సంవత్సరాలు, గణాంకాలను గుర్తుంచుకునే క్రమంలో వ్యక్తిగతంగా అన్వయించుకోవడం కూడా మరో ముఖ్యమైన మెమొరీ టిప్‌గా నిలుస్తోంది. ఇలా.. టైమ్‌ ప్లాన్‌ నుంచి రివిజన్‌ వరకు నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే ప్రిలిమ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

ప్రిలిమ్స్‌.. ముఖ్య టాపిక్స్‌ 

కరెంట్‌ అఫైర్స్‌

  • బడ్జెట్, ఆర్థిక సర్వే, అంతర్జాతీయ ఒప్పందాలు.
  • జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు. 
  • ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విధానాలు.
  • గత ఏడాది కాలంలో అమల్లోకి వచ్చిన సంక్షేమ పథకాలు.
  • ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు వాటి ఉద్దేశం.

చరిత్ర

  • ఆధునిక చరిత్ర; జాతీయోద్యమం. 
  • ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక-ఆర్థిక చరిత్ర అంశాలు. 
  • ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన-పరిపాలన విధానాలు; బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాట్లు-ఉద్యమాలు(ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలు.

రాజ్యాంగం

  • రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ,పీఠిక,తాజా రాజ్యాంగ సవరణలు-వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.
  • రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్, వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
  • పంచాయతీరాజ్‌ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె. రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం.
  • ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన జరిగే తీరు. విధానాల అమలు, వాటి సమీక్ష. -ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు.
  • కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

ఎకానమీ

  • ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు-మూలధన వనరుల పాత్ర.
  • ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసా­య రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం). పారిశ్రామిక తీర్మానాలు-వ్యవసాయ విధానం.
  • బ్యాంకింగ్‌ రంగం ప్రగతి-సంస్కరణలు-ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం.
  • తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

  • గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు.
  • ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు-కారకాలు.
  • సైబర్‌ సెక్యూరిటీ యాక్ట్‌.
  • రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌ ప్రయోగాలు.
  • జాతీయ ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు.
  • పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు. 
  • వివిధ ఐటీ పాలసీలు.

జాగ్రఫీ

  • భౌగోళిక వనరులు, సహజ సంపద.
  • పర్యావరణ సమస్యలు-ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. 
  • సౌర వ్యవస్థ, భూమి అంతర్‌ నిర్మాణం, శిలలు, జియలాజికల్‌ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. 
  • మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ; ఆదివాసులు;రుతుపవనాలు; మాన్‌సూన్‌ మెకానిజం; నదులు; జలాల పంపిణీ; వివాదాలు.
Published date : 14 Feb 2024 05:09PM
PDF

Photo Stories