Skip to main content

AP CM YS Jagan Mohan Reddy : సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ సివిల్స్ ర్యాంక‌ర్లు.. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నిర్వహించిన సివిల్స్‌–2022 తుది ఫలితాలు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన‌ అభ్యర్థులు సత్తా చాటారు.
UPSC Civils 2023 Rankers With AP CM YS Jagan
AP CM YS Jagan Congratulates Telugu UPSC Civils 2022 Rankers

జాతీయస్థాయిలో టాప్‌ ర్యాంకులను సాధించి రికార్డు సృష్టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి 17 మంది సివిల్స్‌లో ఉన్న‌త ర్యాంకులు సాధించారు. ఈ సివిల్స్‌ ర్యాంకర్లు జూన్ 23వ తేదీన(శుక్ర‌వారం) సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

AP CM YS Jagan with upsc civils rankers

ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ సివిల్స్ ర్యాంకర్లను అభినందించారు. అలాగే ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై.. ప్రజా పాలనలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సూచించారు.

☛ UPSC Civils 22nd Ranker Pavan Datta Interview : నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..|ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా..

ఏపీకి చెందిన 17 మంది యూపీఎస్‌సీ (సీఎస్‌ఈ) 2022 ర్యాంకర్లు వీరే..:

upsc civils ranker 2023

జీవీఎస్‌ పవన్‌ దత్తా, తిరుపతి (ర్యాంక్‌ 22), ఎం.శ్రీ ప్రణవ్, గుంటూరు (60), ఎల్‌.అంబికా జైన్, కర్నూలు (69), షేక్‌ హబీబుల్లా, కర్నూలు (189), కేపీఎస్‌ సాహిత్య, వైజాగ్‌ (243), బి.ఉమామహేశ్వర రెడ్డి, కదిరి (270), పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, విజయవాడ (292), వి.లక్ష్మీ సుజాత, మార్టూరు (311), బి.వినూత్న, ఒంగోలు (462), సీ.సమీర్‌ రాజా, ఆదోని (464), ఆర్‌.నవీన్‌ చక్రవర్తి, తాళ్ళచెరువు, పల్నాడు జిల్లా (550), వైయూఎస్‌ఎల్‌ రమణి, ఎదరాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా (583), టి.హేమంత్, చిలకలూరిపేట (593), పి.భార్గవ్, విజయనగరం (772), కే. శ్రీకాంత్‌ రెడ్డి, శిరిగిరిపాడు, పల్నాడు జిల్లా (801), ఎం.సుజిత్‌ సంపత్, నందిగామ (805), ఎన్‌. కృపాకర్, కడప (866).

☛ Civils 2022 40th Ranker: నా success సీక్రెట్ ఇదే..

Published date : 23 Jun 2023 05:48PM

Photo Stories