Skip to main content

Army Recruitment Rally: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తేదీలు విడుద‌ల‌

సాక్షి, హైదరాబాద్‌: హెడ్‌క్వార్టర్స్‌ యూనిట్‌ కోటా కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని జూలై 8 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించను న్నట్టు మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు.
Army Recruitment Rally

ఈ మేరకు మే 28న‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకోసం ఈ ర్యాలీ నిర్వ హిస్తున్నట్టు పేర్కొన్నారు.

చదవండి: Indian Tank Driver: యుద్ధ ట్యాంకుల రేసులో భారత్‌ ఘన విజయం

ఈ ఉద్యోగాలకు స్పోర్ట్స్‌ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 5న ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్‌ ఏఓసీ సెంటర్, థాపర్‌ స్టేడి యంలో ధ్రువపత్రాలతో హాజరుకావాల న్నారు.

స్పోర్ట్స్‌ కోటా కింద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా అథ్లెటిక్‌ పోటీలో పాల్గొని ఉన్నవారే అర్హులన్నారు.

చదవండి: NCC Training Camp: ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్ష‌ణ శిబిరం ప్రారంభం.. దీనితో విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు!

ఈ ఉద్యోగా లకు దరఖాస్తు చేసుకునే అర్హులైన అభ్యర్థులు అదనపు వివరాల కోసం ‘www.joinindianarmy@nic.in’ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.

Published date : 29 May 2024 11:20AM

Photo Stories