Skip to main content

Agniveer Jobs: 15న ఉద్యోగ నియామక ర్యాలీ

కందనూలు: సికింద్రాబాద్‌లోని ఏయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో వాయుసేన ఉద్యోగ నియామక ర్యాలీని సెప్టెంబ‌ర్‌ 15న నిర్వహించనున్నట్లు వింగ్‌ కమాండర్‌, రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ హురుప్రిత్‌ అత్వాల్‌ ఆగ‌స్టు 27న‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Agniveer
15న ఉద్యోగ నియామక ర్యాలీ

 వాయు సేనలో ఉద్యోగం పొందాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణ అవకాశమని, కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే ఈ ఓపెన్‌ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

అగ్నివీర్‌, వాయు కింద ఈ నియామకాలు ఉంటాయని తెలిపారు. సెప్టెంబ‌ర్‌ 15న సికింద్రాబాద్‌, బేగంపేటలోని 12 ఏయిర్‌ మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌, ఏయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగే ఓపెన్‌ ర్యాలీ నియామకాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలని వివరించారు.

జిల్లాలో ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు http://afnipathvayu. cdac.in/AV/నోటిఫికేషన్‌ లింక్‌లో చూడాలని తెలియజేశారు.

చదవండి:

Agniveer: సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ... ఈ డాక్యుమెంట్లు లేక‌పోతే ఇంటికే..!

Air Force Recruitment: వైమానిక దళంలో రిక్రూట్‌మెంట్‌పై అవగాహన

Published date : 28 Aug 2023 03:05PM

Photo Stories