Skip to main content

Air Force Recruitment: వైమానిక దళంలో రిక్రూట్‌మెంట్‌పై అవగాహన

Awareness of Air Force Recruitment

కర్నూలు(రూరల్‌)/కర్నూలు కల్చరల్‌: భారత వైమానిక దళంలో రిక్రూట్‌మెంట్‌పై శుక్రవారం నగరంలోని ఔట్‌డోర్‌ స్టేడియం, బీ తాండ్రపాడులోని ఎస్‌జీపీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు. యువజన సర్వీసుల శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులకు సికింద్రాబాద్‌ ఎయిర్‌ మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌ నుంచి నాన్‌ కమిషనర్‌ ఆఫీసర్లు రాజేష్‌, అరుణ్‌ గోస్వామి, సునిల్‌ దాసు హాజరయ్యారు. దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, ఎంపికై న అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ తదితర వాటి గురించి వివరించారు. అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలకు ఈ నెల 27 నుంచి ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్‌(ఎంపీసీ), మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులన్నారు.పూర్తివివరాలకు https://agnipathvayu.cdac.in ను సంప్రదించాలన్నారు. సెట్కూర్‌ సీఈఓ రమణ, పాలిటెక్నిక్‌ కళాశాల కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవిఎస్‌ఎస్‌ఎన్‌ప్రసాద్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Defense Sector: ఏయూతో రక్షణ రంగాల అధికారుల సమావేశం

Published date : 29 Jul 2023 03:20PM

Photo Stories