Defense Sector: ఏయూతో రక్షణ రంగాల అధికారుల సమావేశం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో పలు రాష్ట్రాల రాజ్ సైనిక్ బోర్డు, నేవీ, ఎయిర్‌ఫోన్స్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణ మోహన్ పాల్గొన్నారు. దేశ రక్షణ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగలు విద్యార్హతలు, నైపుణ్యాలు, వృత్తి అనుభవాలను పరిగణలోనికి తీసుకుని వారికి డిగ్రీలను ప్రధానం చేసే దిశగా మరింత పటిష్టంగా పనిచేయాలని నిర్ణయించారు. వీరికి ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ కోర్సుల్లో సర్టిఫికెట్లు ప్రధానం చేసే విధివిధానాలపై చర్చించారు. దీనికోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో సమాచారం పంచే ప్రక్రియను తయారు చేశారు.
BSF Exams Hall Tickets 2023: గ్రూప్ బి, గ్రూప్ సి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హాల్ టిక్కెట్‌ల విడుదల... ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి!
సైనికోద్యోగులకు ఉన్నత విద్యను అందించే విధంగా ఏయూ చేపడుతున్న ఉపయుక్త కార్యక్రమాలను సైనికాధికారులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సైతం ఇదేవిధమైన సహకారం అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ డీన్ ఆచార్య కె.నిరంజన్, పరీక్షల విభాగం డీన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, కంప్యూటర్ సెంటర్ సంచాలకులు ఆచార్య భాస్కర రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.