Skip to main content

Agniveer Army Rally: ‘అగ్నివీర్‌’కు అంతా సిద్ధం.. ర్యాలీ తేదీలు ఇవే..

సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్‌ ర్యాలీని 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు.
Agniveer Army Rally
‘అగ్నివీర్‌’కు అంతా సిద్ధం.. ర్యాలీ తేదీలు ఇవే..

 ఇప్పటికే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రాష్ట్రంలోని 7,397మంది అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. ప్రతిరోజు 1,200 మంది హాజరయ్యే అభ్యర్థులకు తేదీ, సమయంతో సహా అడ్మిట్‌ కార్డులు జారీచేశారు. ఆయా తేదీల్లో తెల్లవారుజామున 2–30గంటలకు పోటీలు ప్రారంభం కానుండగా... ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. ఈమేరకు స్టేడియాన్ని అదుపులోకి తీసుకున్న సైన్యాధికారులు పరీక్షల నిర్వహణకు గాను ఏర్పాట్లు పూర్తిచేశారు.

చదవండి:

Army: ‘అగ్నివీర్‌’ ర్యాలీ తేదీలు ఇవే.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..

Air Force Agniveer Notification 2023: ఇంటర్‌తోనే ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు.. 25 శాతం మందికి శాశ్వత కొలువు

Published date : 31 Aug 2023 03:20PM

Photo Stories