సివిల్స్ ప్రిలిమ్స్–2021 విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్ ఇలా విభిన్నంగా..
Sakshi Education
ప్రిలిమ్స్‌లో ప్రశ్నల శైలి, వెయిటేజీల తీరు ప్రతి ఏటా మారిపోతోంది.
ఒక సంవత్సరం హిస్టరీకి ప్రాధాన్యం లభిస్తే.. మరో ఏడాది పాలిటీకి వెయిటేజీ పెరుగుతుంది. ఒక్కోసారి పూర్తిగా కరెంట్ అఫైర్స్ హవా కొనసాగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా సన్నద్ధులైన అభ్యర్థులకే ఈ పరీక్షలో విజయావకాశాలు ఉంటాయి. ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో చదవడం, వైవిధ్యభరితమైన ప్రశ్నల సాధన, బేసిక్స్‌పై పట్టుతో సక్సెస్ సొంతం చేసుకోవచ్చు. బేసిక్స్‌పై పట్టుతో ప్రిలిమ్స్‌లో దాదాపు సగం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రశ్నల్లో కనీసం ఐదు నుంచి పది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగితే మెయిన్స్‌కు అర్హత లభించినట్లే...!
జనరల్ స్టడీస్..
పోటీ పరీక్షలేవైనా జనరల్ స్టడీస్ కీలకం అన్నది తెలిసిందే. జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. జీఎస్‌ను స్టాటిక్, డైనమిక్ భాగాలుగా విభజించుకోవాలి. 1857 తిరుగుబాటు, భారత భౌగోళిక స్వరూపం తదితరాలు స్టాటిక్ కిందకొస్తాయి. న్యూస్ పేపర్లు, యోజన మ్యాగజీన్, ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తదితరాలను అనుసరించడం ద్వారా.. డైనమిక్ పార్ట్‌పై అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించ గలుగుతారు.

ఇంకా చదవండి: part 3: సివిల్స్‌లో భారత చరిత్ర గురించి అడిగే ముఖ్యమైన అంశాలివే..
Published date : 27 Feb 2021 02:46PM