Skip to main content

కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నూతన విధానం..

జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు తదితరాల్లో జియాలజిస్టు, కెమిస్ట్, జూనియర్ హైడ్రోజియాలజిస్టు వంటి ఉన్నత ఉద్యోగాలకు మార్గం.. కంబైన్డ్ జియోసైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్.
దీన్ని యూపీఎస్సీ.. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్‌గా పేరు మార్చుతూ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష విధానాన్ని, సిలబస్‌ను కూడా సవరించింది. ఈ నూతన విధానం 2020 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఔత్సాహికుల దీర్ఘకాల సన్నద్ధతకు ఉపయోగపడేలా పరీక్ష విధానం, సిలబస్‌పై సమగ్ర కథనం...

మూడంచెల్లో...
  • కంబైన్డ్ జియోసైంటిస్ట్ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో రెండు పేపర్లుగా ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
  • ప్రిలిమినరీలో ప్రతిభ చూపిన వారిని రెండో దశ మెయిన్స్‌కి ఎంపిక చేస్తారు.
  • డిస్క్రిప్టివ్ తరహాలో నిర్వహించే మొయిన్స్‌లో ప్రతి విభాగంలో మూడు పేపర్లు ఉంటాయి.
  • మొయిన్స్‌లో ప్రతిభ చూపిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
  • తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఇప్పటి వరకు ఉన్న జనరల్ ఇంగ్లిష్ పేపర్‌ను కొత్త విధానంలో తొలగించారు.
ప్రిలిమ్స్ (మొదటి దశ) :
స్ట్రీమ్ 1: జియాలజిస్ట్ అండ్ హైడ్రోజియాలజిస్ట్

సబ్జెక్టు సమయం మార్కులు
పేపర్ 1: జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2: జియాలజీ/హైడ్రోజియాలజీ 2 గంటలు 300
మొత్తం 400

స్ట్రీమ్ 2: జియోఫిజిసిస్ట్
పేపర్ 1: జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2: జియోఫిజిక్స్ 2 గంటలు 300
మొత్తం 400

స్ట్రీమ్ 3: కెమిస్ట్
పేపర్ 1: జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2: కెమిస్ట్రీ 2 గంటలు 300
మొత్తం 400

మెయిన్స్ (రెండో దశ) :
స్ట్రీమ్ 1 (జియాలజిస్ట్):
జియాలజీకి సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులు కేటాయించారు. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
స్ట్రీమ్ 2 (జియోఫిజిసిస్ట్): జియోఫిజిక్స్ నుంచి మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులు కేటాయించారు. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
స్ట్రీమ్ 3 (కెమిస్ట్): కెమిస్ట్రీ నుంచి మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులు కేటాయించారు. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
స్ట్రీమ్ 4 (జూనియర్ హైడ్రోజియాలజిస్ట్): ఈ స్ట్రీమ్‌లో జియాలజీ నుంచి రెండు పేపర్లు; హైడ్రోజియాలజీ నుంచి ఒక పేపర్ ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులు కేటాయించారు. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

మూడో దశ :
ఇందులో 200 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది.

ప్రిలిమ్స్ సిలబస్ :
జనరల్ స్టడీస్ (అన్ని విభాగాలకు) :
  • తాజా జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలు.
  • భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం.
  • భారత, ప్రపంచ భౌగోళిక అంశాలు (భౌతిక, సాంఘిక, ఆర్థిక).
  • ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్- రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పబ్లిక్ పాల సీ, హక్కులకు సంబంధించిన సమస్యలు తదితర అంశాలు.
  • ఆర్థిక, సామాజిక అభివృద్ధి- సుస్థిర అభివృద్ధి, పేదరికం, సమ్మిళిత అభివృద్ధి, జనాభా, సాంఘిక రంగ కార్యక్రమాలు తదితర అంశాలు.
  • పర్యావరణ జీవావరణం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన సాధారణ సమస్యలు.
  • జనరల్‌సైన్స్.
జియాలజీ/హైడ్రో జియాలజీ :
ఫిజికల్ జియాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, మినరా లజీ, ఇగ్నేస్ పెట్రాలజీ, మెటామార్ఫిక్ పెట్రాల జీ, సెడిమెంటాలజీ; పేలియంటాలజీ, స్ట్రాటిగ్ర ఫీ, ఎకనామిక్ జియాలజీ, హైడ్రోజియాలజీ.

జియోఫిజిక్స్ :
సాలిడ్ ఎర్త్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్ మెథడ్స్ ఇన్ జియోఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నటిజమ్, జియోఫిజికల్ ప్రాస్పెక్టింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ థర్మోడైనమిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ రేడియోమెట్రీ.

కెమిస్ట్రీ :
కెమికల్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్ అండ్ స్ట్రక్చర్ (అయానిక్, కోవేలెంట్, కోఆర్డినేట్ బాండింగ్); యాసిడ్స్ అండ్ బేసెస్; థియరిటికల్ బేసిస్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఇనార్గానిక్ అనాలసిస్ (వాల్యుమెట్రిక్ అనాలసిస్); కెనైటిక్ థియరీ అండ్ గ్యాసియస్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియమ్, సొల్యూషన్స్ ఆఫ్ నాన్ ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, మాలిక్యులర్ రీ- అరేంజ్‌మెంట్స్.

మెయిన్స్ సిలబస్..
జియాలజీ-పేపర్ 1 :

సెక్షన్ ఎ: ఫిజికల్ జియాలజీ అండ్ రిమోట్ సెన్సింగ్.
సెక్షన్ బి: స్ట్రక్చరల్ జియాలజీ
సెక్షన్ సి: సెడిమెంటాలజీ
సెక్షన్ డి: పేలియంటాలజీ
సెక్షన్ ఇ: స్ట్రాటిగ్రఫీ

జియాలజీ-పేపర్ 2 :
సెక్షన్ ఎ: మినరాలజీ
సెక్షన్ బి: జియోకెమిస్ట్రీ అండ్ ఐసోటోప్ జియాలజీ
సెక్షన్ సి: ఇగ్నేస్ పెట్రాలజీ
సెక్షన్ డి: మెటామార్ఫిక్ పెట్రాలజీ
సెక్షన్ ఇ: జియోడైనమిక్స్

జియాలజీ-పేపర్ 3 :
సెక్షన్ ఎ: ఎకనామిక్ జియాలజీ
సెక్షన్ బి: ఇండియన్ మినరల్ డిపాజిట్స్ అండ్ మినరల్ ఎకనామిక్స్
సెక్షన్ సి: మినరల్ ఎక్స్‌ప్లొరేషన్
సెక్షన్ డి: ఫ్యూయల్ జియాలజీ అండ్ ఇంజనీరింగ్ జియాలజీ
సెక్షన్ ఇ: ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్

హైడ్రోజియాలజీ :
సెక్షన్ ఎ: అక్కరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్.
సెక్షన్ బి: గ్రౌండ్ వాటర్ మూవ్‌మెంట్ అండ్ వెల్ హైడ్రాలిక్స్.
సెక్షన్ సి: వాటర్ వెల్స్ అండ్ గ్రౌండ్ వాటర్ లెవల్స్.
సెక్షన్ డి: గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ప్లొరేషన్.
సెక్షన్ ఇ: గౌండ్ వాటర్ క్వాలిటీ అండ్ మేనేజ్‌మెంట్.
Published date : 04 Sep 2018 02:18PM

Photo Stories