వర్చువల్ ఇంటర్న్‌షిప్స్ నిర్వహిస్తున్న రంగాలు.. ఇంటర్న్ ట్రైనీల ఎంపిక విధానం ఇలా..
అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్, ఎంటర్‌ప్రైజ్ ఇంప్రూవ్‌మెంట్, సేల్స్, డిజిటల్ అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్, బ్రాండింగ్, కస్టమర్ సపోర్ట్, మార్కెట్ అనాలిసిస్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఆపరేషన్స్.. మొత్తం వర్చువల్ ఇంటర్న్‌షిప్స్‌లో 45 శాతం ఈ విభాగాల్లోనే లభించాయి.
వర్చువల్ ఇంటర్న్‌షిప్స్ అందించడంలో మీడియా రంగం రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఇంటర్న్ నియామకాల్లో 25 శాతం ఈ రంగంలో లభించాయి. మీడియా రంగంలో కంటెంట్ రైటింగ్, జర్నలిజం, ఎడిటోరియల్, రన్నింగ్ బ్లాగ్, కాపీ రైటింగ్, సోషల్ మీడియా అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్, పీఆర్, పిక్చర్చ్ అండ్ వీడియోగ్రఫీలో అవకాశాలు అందాయి.
ఇంజనీరింగ్ విభాగంలో 18 శాతం అవకాశాలు లభించాయి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్‌మెంట్, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్ డవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ టెస్టింగ్, క్యాడ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఇంప్రూవ్‌మెంట్ తదితర సాంకేతిక విభాగాల్లో ఇంటర్న్ నియామకాలు జరిగాయి.
ఎంపికలోనూ అదే పంథా..
- ప్రస్తుతం సంస్థలు అభ్యర్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసేందుకు కూడా వర్చువల్ విధానాన్నే అనుసరిస్తున్నాయి. సంస్థలకు చెందిన హెచ్‌ఆర్ ప్రతినిధులు, ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఇంటర్వూలు నిర్వహించి.. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఆఫర్లు అందిస్తున్నారు.
- సంస్థలు అభ్యర్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్; టైమ్ మేనేజ్‌మెంట్; డెసిషన్ మేకింగ్; ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్; క్రియేటివిటీ; టెక్ సేవీనెస్ వంటి నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి.
- వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. దరఖాస్తు నుంచి ఇంటర్వూ్య వరకూ.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రెజ్యూమే సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. సంస్థలు కోరుకునే స్కిల్స్‌ను రెజ్యూమ్‌లో హైలెట్ చేయాలి.
జాగ్రత్తలు ఇవే..
- ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు తమకు కేటాయించిన జాబ్ చార్ట్‌కు అనుగుణంగా ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలి.
- ఎప్పటికప్పుడు తాము పూర్తి చేసిన పనికి సంబంధించి నివేదికను తమ రిపోర్టింగ్ హెడ్‌కు అందించాలి.
- నిర్దిష్టంగా ఒక ప్రాజెక్ట్ లేదా ప్రాబ్లమ్‌ను ఇచ్చి.. సదరు సమస్యకు పరిష్కారం చూపాలని అడిగినప్పుడు.. రీసెర్చ్ చేయడం, వాస్తవంగా మార్కెట్ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వడం వంటివి చేయాలి.
- సందేహాల నివృత్తి, వర్క్ ప్రోగ్రెస్‌ను తెలుసుకునేందుకు నిరంతరం ఆయా విభాగాధిపతులు, సహచరులతో ఆన్‌లైన్‌లో సంప్రదింపులు సాగించాలి.
వర్చువల్ ఇంటర్న్‌షిప్స్–ముఖ్యాంశాలు
- గత ఏడాది కాలంలో మొత్తం ఇంటర్న్‌షిప్స్‌లో 63 శాతం వర్చువల్ నియామకాలే.
- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిజిలాకర్ విభాగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు.
- ఏఐసీటీఈ–TULIP స్కీమ్‌లో అర్బన్ డెవలప్‌మెంట్, స్మార్ట్ సిటీస్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్.
- పలు సాఫ్ట్‌వేర్ సంస్థలతో కలిసి వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్న ఏఐసీటీఈ.
ముఖ్యమైన వెబ్‌సైట్స్..
- https://digilocker.gov.in/internship.html
- www.internshala.com
- www.letsintern.com
- www.internships.com
- www.hellointern.com
ఏఐసీటీఈ.. చేదోడుగా..
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంలో ఏఐసీటీఈ చేదోడుగా నిలుస్తోంది. ముఖ్యంగా తులిప్ ద్వారా పలు విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తోంది. దీని ద్వారా కేవలం టైర్–1 ఇన్‌స్టిట్యూట్‌లే కాకుండా.. జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాలు, ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తున్నాయి.
– ప్రొ.బి.చంద్రశేఖర్, నేషనల్ చీఫ్ కో–ఆర్డినేటర్, ఏఐసీటీఈ–ఎన్‌ఈఏటీ
ఇంకా చదవండి : part 1 : ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్.. ట్రైనీలకు కలిగే ప్రయోజనాలు తెలుసుకోండిలా..!