Skip to main content

రానున్న కాలంలో అన్ని రంగాలను ఏలానున్న ఏఐ.. అవగాహన పెంచుకోండిలా..!

రానున్న కాలంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, బ్యాంకింగ్‌ రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం మరింతగా పెరగనుంది.

కాబట్టి ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల విద్యార్థులు ‘ఏఐ’ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం లాభిస్తుంది. ముఖ్యంగా ‘ఏఐ’ టెక్నాలజీ అనువర్తనాలు.. ఎదురవుతున్న ఆటుపోట్లు.. కంప్యూటర్‌ డేటాపై దీని ప్రభావం.. ఇందులో వస్తున్న తాజా మార్పులు..వినియోగం సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయిలో అంచనాకు రావాలి. ప్రధానంగా కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు.. ఏఐపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా ఇంటర్వూ్యలో విజయం సాధించి.. కొలువు సొంతం చేసుకోవడంలో ముందుండొచ్చు.

ఆ రంగాల్లో కొలువులు..
ప్రస్తుతం ఏఐ, ఎంఎల్‌ (మెషిన్‌ లెర్నింగ్‌) స్కిల్స్‌ ఉంటేనే.. సంస్థలు అభ్యర్థుల వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది! యువత సైతం ఈ ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ.. జాబ్‌ మార్కెట్‌లో పోటీకి ‘సై’ అంటోంది. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఏఐ నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉండట్లేదు. కృత్రిమ మేధకు సంబంధించి కంపెనీలు టెన్సార్స్‌ ఫ్లో టూల్‌ను బాగా వినియోగిస్తున్నాయి. గూగుల్‌ రూపొందిన ఈ టూల్‌...ప్రోగ్రామ్స్, సాఫ్ట్‌వేర్స్‌కు సంబంధించి న్యూమరికల్‌ కంప్యూటేషన్‌ను సుల భంగా పూర్తి చేసి.. మెషీన్‌ లెర్నింగ్‌ ప్రక్రియను పైథాన్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధా నంగా ఐటీ, ఎడ్యుకేషన్, శిక్షణ, ఇ–కామర్స్, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోంది.

ఆ ఐదు టాప్‌..
నేటి టెక్నాలజీ ఆధారిత పారిశ్రామిక రంగంలో మొదటి ఐదు స్థానాల్లో నిలుస్తున్న కొలువులు.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌డేటా అనలిటిక్స్, డిజిటల్‌ మార్కెటింగ్, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్స్‌. కొత్త తరం యువత వృత్తి నిపుణులు. వీరికి టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. కాబట్టి వీరు మారుతున్న టెక్నాలజీని ముఖ్యంగా ఏఐని నేర్చుకుంటే.. ఇలాంటి సరికొత్త ఉద్యోగాలను సులభంగానే సొంతం చేసుకోగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకా చ‌ద‌వండి: part 3: ఈ టెక్నాలజీ ప్రవేశంలో ఉద్యోగాల తీరులో మార్పులు.. దాని భవిష్యత్తు గురించి తెలుసుకోండిలా..

Published date : 16 Apr 2021 03:10PM

Photo Stories