మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఇలా.. ఉద్యోగాన్వేషణ నైపుణ్యాలు అందిపుచ్చుకోండి..
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం, రిమోట్ వర్క్ కల్చర్ పెరిగింది. సంప్రదాయ పని పద్ధతులకు భిన్నంగా కొత్త విధానాలు ఆవిష్కృతమయ్యాయి. ఇవి కరోనా అనంతరం కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా మేనేజ్‌మెంట్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి. హ్యాకథాన్స్, డెమో అవర్స్ వంటి వాటి ద్వారా విద్యార్థులకు వారు నేర్చుకున్న స్కిల్స్ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ఇలాంటి వాటిపైనా మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు దృష్టి పెట్టాలి. విద్యార్థులు కూడా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా స్కిల్స్ అందిపుచ్చుకునేలా ముందుకు సాగాలి.
నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి..
ఇటీవల అంతర్జాతీయంగా ఓ సర్వేలో వెల్లడించిన ప్రకారం–మేనేజ్‌మెంట్ విద్యార్థులకు 18 స్కిల్స్ తప్పనిసరి కానున్నాయి. వీటిలో మేనేజింగ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్, మేనేజింగ్ టూల్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్.. టాప్–3 స్కిల్స్‌గా నిలిచాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు మేనేజ్‌మెంట్ విద్యార్థులు కృషి చేయాలి. అంతేకాకుండా ప్రతి పది మంది రిక్రూటర్స్‌లో తొమ్మిది మంది.. బిజినెస్ స్కూల్స్ నుంచే మ్యాన్‌పవర్‌ను నియమించుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం.. ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో చదివిన వారికి బహుముఖ నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ బాధ్యతలను చేపట్టే సమర్థత ఉంటాయని భావించడమే.
– డాక్టర్ ఎస్.ప్రతాప్ రెడ్డి, ఫౌండర్ చైర్మన్, ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
ఇంకా చదవండి : part 1: కొలువు సులువు చేసే ఈ స్కిల్స్ నేర్చుకోండి.. అన్వేషణలో దూసుకుపోండి..