Skip to main content

అమెజాన్‌.. అంతర్జాతీయంగా ఆఫర్లు అందుకోండిలా!

FAANG
amazon

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఎంపిక ప్రక్రియ గరిష్టంగా మూడు వారాలపాటు కొనసాగుతుంది. అభ్యర్థులకు ఐదు నుంచి ఆరు రౌండ్లలో ఇంటర్వూ్యలు, రాత పరీక్షలు నిర్వహిస్తారు.  ముందుగా అభ్యర్థుల రెజ్యుమేను పరిశీలిస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సరితూగుతారని భావిస్తే.. ఎంపిక ప్రక్రియకు పిలుపు వస్తుంది. 
తొలుత రిటెన్‌/ఆన్‌లైన్‌ కోడింగ్‌ రౌండ్స్‌తో ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. రిటెన్‌/ఆన్‌లైన్‌ కోడింగ్‌ రౌండ్స్‌లో..అభ్యర్థుల్లోని టెక్నికల్‌ స్కిల్స్, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించేలా రాత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా అప్టిట్యూడ్, టెక్నికల్‌ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 
  రాత పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ కోడింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన్‌ కోడింగ్‌ రౌండ్‌లో..ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. రిటెన్‌/ఆన్‌లైన్‌ కోడింగ్‌ టెస్ట్‌ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి టెలిఫోనిక్‌ ఇంటర్వూలు ప్రారంభమవుతాయి. తొలి టెలిఫోనిక్‌ ఇంటర్వూలో అభ్యర్థుల రెజ్యుమే, పూర్తిచేసిన ప్రాజెక్ట్‌ల వివరాలు తెలుసుకుంటారు. టెలిఫోనిక్‌ ఇంటర్వూ్య తర్వాత ప్రత్యక్ష ఇంటర్వూలకు(ఆన్‌సైట్‌ ఇంటర్వూ్య) పిలుస్తారు. 
 మొదటి ఇంటర్వూ అభ్యర్థుల్లోని అల్గారిథమ్‌ నైపుణ్యాలను తెలుసుకునేలా ఉంటుంది. తర్వాత రౌండ్‌లోనూ ఇవే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత హెచ్‌ఆర్‌/హైరింగ్‌ మేనేజర్‌ రౌండ్స్‌ పేరిట ఇంటర్వూ నిర్వహిస్తారు. హైరింగ్‌ మేనేజర్‌ రౌండ్‌ ఇంటర్వూని పూర్తిగా టెక్నికల్‌ రౌండ్‌గా పేర్కొనొచ్చు. ఇందులో డేటాస్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, కొన్ని క్లిష్టమైన పజిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విజయం సాధిస్తే.. చివరగా బార్‌ రైజర్‌ రౌండ్‌ ఉంటుంది. 
  బార్‌ రైజర్‌ రౌండ్‌లో.. సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుగుణంగా సదరు అభ్యర్థి సరితూగుతారో లేదో పరిశీలిస్తారు. అంతిమంగా సంస్థ హెచ్‌ఆర్‌ కమిటీ.. తొలిదశ నుంచి అభ్యర్థుల ప్రతిభను అన్ని కోణాల్లో పరిశీలించి..నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఈ నివేదిక ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 
 

Published date : 14 Jul 2021 06:28PM

Photo Stories