ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఈ లెర్నింగ్.. నేర్చుకోండిలా ఈజీగా!
Sakshi Education
కరోనా ప్రభావం.. ఎక్కడ చూసినా.. అంతా ఆన్‌లైన్ కార్యకలాపాలు! విద్యా రంగంలోనూ ఇదే పరిస్థితి! నర్సరీ నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకూ.. ఆన్‌లైన్ విధానంలోనే విద్యాబోధన! గతేడాది నుంచి.. ఇప్పటి వరకు.. ఇంకా చెప్పాలంటే.. మరికొన్ని నెలల వరకు.. ఆన్‌లైన్ చదువులే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
కాబట్టి పరీక్షలు వాయిదా పడుతున్నాయని విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా.. ఆన్‌లైన్ లెర్నింగ్‌పై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో పాఠాలు అవగాహన చేసుకొని.. నైపుణ్యం పెంచుకోవాలంటే.. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఆన్‌లైన్ లెర్నింగ్‌ను సమర్థంగా వినియోగించుకోవడానికి అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ..
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ టీచింగ్, ఆన్‌లైన్ లెర్నింగ్.. గతేడాది కాలంగా ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. కరోనా పరిణామాలతో ఆన్‌లైన్ లెర్నింగ్ తప్పనిసరిగా మారింది. మరోవైపు ఆన్‌లైన్ లెర్నింగ్ పరంగా విద్యార్థులకు పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. పాఠాలు అర్థం కావట్లేదని, సబ్జెక్ట్‌లపై అవగాహన రావట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. క్లాస్ రూమ్ లెర్నింగ్ మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ పాఠ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
‘ఆఫ్‌లైన్’ మాదిరిగానే..
ఆన్‌లైన్ విధానం అనగానే.. ఇంట్లో కూర్చొని నచ్చిన సమయంలో చదువుకోవచ్చనే భావన వీడాలి. ఆన్‌లైన్ లెర్నింగ్‌ను కూడా ఆఫ్‌లైన్ లెర్నింగ్(క్లాస్ రూమ్ బోధన) మాదిరిగానే సీరియస్‌గా తీసుకోవాలి. అలాకాకుండా నచ్చిన సమయంలో చదువుకోవచ్చులే అనే భావనతో.. ఆడుతూ, పాడుతూ అనే ధోరణిలో వ్యవహరిస్తే.. అకడమిక్ నైపుణ్యాల సాధనపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఏకాగ్రత ముఖ్యం..
ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరయ్యే విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. ఆన్‌లైన్ సెషన్‌కు హాజరవుతున్న విద్యార్థులు తమ దృష్టంతా వింటున్న అంశంపైనే ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఇంట్లో సరైన స్టడీ వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఆన్‌లైన్ క్లాస్ వినే సమయంలో ఎలాంటి అవాంతరాలు కలగని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తద్వారా కుటుంబ సభ్యుల సంభాషణలు, ఇంట్లో టీవీ రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులు ఏకాగ్రతతో అవగాహన చేసుకున్న పాఠాలు మాత్రమే ఎక్కువకాలం మెదడులో నిక్షిప్తమవుతాయని గుర్తించాలి.
క్రమశిక్షణ..
ఆన్‌లైన్ లెర్నింగ్ పరంగా రాణించాలంటే.. స్వీయ క్రమశిక్షణ అలవరచుకోవాలి. ఆన్‌లైన్ విధానంలో.. విద్యార్థులను పర్యవేక్షించడం టీచర్లకు సాధ్యం కాదు. దీన్ని అవకాశంగా తీసుకొని చాలామంది పాఠాలను సరిగా వినరు. అలాకాకుండా స్వీయ క్రమశిక్షణతో సెషన్ పూర్తయ్యే వరకు మనసుపెట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. రికార్డెడ్ వీడియోలను వినేటప్పుడు కూడా కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనే ధోరణి సరికాదు. ఒక వేళ సేదతీరాలనుకుంటే.. విశ్రాంతి సమయాన్ని అయిదు నుంచి పది నిమిషాలకు పరిమితం చేయాలి. ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని..పూర్తయ్యే వరకు..రిలాక్సేషన్ అనే మాట మనసులో మెదలకుండా చూసుకోవాలి.
ఇంకా చదవండి: part 2: ముందస్తు అవగాహనతో సాగితే.. అకడమిక్ మంచి ఫలితాలు సాధించొచ్చు..

Published date : 24 May 2021 07:41PM