MAT Notification 2022: 600పైగా మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు... పరీక్ష విధానం, సిలబస్ ఇలా..
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది. మ్యాట్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 600పైగా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. మ్యాట్ సమాచారం..ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ).. మ్యాట్ పరీక్షను ఏటా నాలుగు సార్లు నిర్వహిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఆసక్తి ఉంటే రెండు విధానాల్లో పరీక్షకు హాజరుకావచ్చు. ఈ పరీక్షలో సాధించిన స్కోరుకు ఏడాది పాటు వాలిడిటీ ఉంటుంది.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసే వారు కూడా దరఖాస్తుకు అర్హులే.
పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ) లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) లేదా ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(ఐబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ఐదు విభాగాలు
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్40 ప్రశ్నలు, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్40 ప్రశ్నలు, మ్యాథమేటికల్ స్కిల్స్40 ప్రశ్నలు, డేటాఅనాలిసిస్ అండ్ సఫిషియెన్సీ40 ప్రశ్నలు, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌ల నుంచి 40 చొప్పున.. ఇలా మొత్తం ఐదు సెక్షన్ల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కులు ఉన్నాయి.
సిలబస్ ఇలా
- లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: ఈ విభాగంలో వెర్బ్, నౌన్,ప్రొనౌన్, ఆడ్జెక్టివ్, ఆడ్‌వెర్బ్, యాంటనిమ్స్‌సినానిమ్స్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్/ఫ్రేజెస్, వొకాబులరీ, ఫిల్ ఇన్ ద బ్లాక్స్, సెంటెన్స్ కరెక్షన్, పారా జంబుల్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
- ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్: ఈ విభాగంలోఅనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఫ్యామిలీ ట్రీ, కోర్స్ ఆఫ్ యాక్షన్, అరేంజ్‌మెంట్, పై చార్ట్, క్యాలెండర్స్, స్టేట్‌మెంట్ కన్‌క్లూజన్స్, స్ట్రాంగ్ ఆర్గ్యూమెంట్ అండ్ వీక్ ఆర్గ్యూమెంట్స్, పజిల్స్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, విజువల్ రీజనింగ్, సిలాజిజమ్, గ్రాఫ్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలుంటాయి.
- డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ: ఈ విభాగంలో డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ అనేవి రెండు వేర్వేరు విభాగాలు. వీటి నుంచి లైన్‌గ్రాఫ్, బార్‌గ్రాఫ్, పైచార్ట్, డేటా కంపారిజన్, క్వాంటీ టేటివ్ కంపారిజన్, డేటా సఫిషియన్సీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
- మ్యాథమెటికల్ స్కిల్స్: ఈ విభాగంలో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, మోడర్న్ మ్యాథ్స్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
- ఇండియన్ అండ్ గ్లోబల్ ఇన్విరాన్‌మెంట్: ఈ విభాగంలో ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌కు సంబం«ధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సన్నద్ధత ఇలా
- ప్రిపరేషన్ పరంగా ప్రణాళిక, పక్కా వ్యూహాం అనుసరించాలి. టాపిక్ వైజ్‌గా షార్ట్‌నోట్స్‌ను ప్రిపేర్ చేసుకోవాలి.
- అభ్యర్థులకు ఆయా వి«భాగాల్లో బేసిక్ కాన్సెప్ట్స్‌పై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలను అడుగుతారు. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
- ఈ పరీక్షలో వేగంతోపాటు కచ్చితత్వంతో సమాధానాల్ని గుర్తించడం కీలకం. ఇందుకోసం అభ్యర్థులు ప్రిపరేషన్‌తోపాటు వీలైనన్నీ ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది.
ప్రవేశం
మ్యాట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ఆయా విద్యాసంస్థలు ఎంబీఏలో ప్రవేశం కల్పిస్తాయి. అభ్యర్థుల ఎంపికకు ప్రతి విద్యాసంస్థ తమ సొంత విధానం అనుసరిస్తుంది. ఆ క్రమంలో గ్రూప్ డిస్కషన్, రిటన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు వంటివి నిర్వహిస్తున్నాయి.
ముఖ్యమైన సమాచారం
పీబీటీ:
- దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 29, 2022
- అడ్మిట్ కార్డ్: ఆగస్టు 30, 2022
- పరీక్ష తేదీ: 04 సెప్టెంబర్ 2022
సీబీటీ:
- దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 12, 2022
- అడ్మిట్ కార్డ్: సెప్టెంబర్ 13, 2022
- పరీక్ష తేదీ: సెప్టెంబర్ 18, 2022
- వెబ్‌సైట్: https://mat.aima.in