క్యాట్- 2015 ప్రిపరేషన్ ప్రణాళిక
Sakshi Education
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. దే శంలోని అత్యుత్తమ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలకు మార్గం సుగమం చేస్తోంది. క్యాట్‌లో సత్తా చాటితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు), ఇతర పతిష్టాత్మక బి-స్కూల్స్‌లలో సీట్లు పొందొచ్చు. ప్రతి ఏడాది ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఈసారి (క్యాట్-2015) దరఖాస్తుల
సంఖ్య రికార్డు స్థాయిలో 2.18 లక్షలకు చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఔత్సాహిక విద్యార్థులు పోటీకి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. క్యాట్ ప్రిపరేషన్ ప్రణాళికా వ్యూహాలపై నిపుణుల సలహాలు...
సెక్షన్ 1:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
సెక్షన్-2:
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్:
సెక్షన్-2లో మరో ఉప విభాగం వెర్బల్ ఎబిలిటీ. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు స్పీడ్ రీడింగ్‌ను అలవర్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే అందులోని కీలక అంశాలను గుర్తించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబ్యులరీలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్
రీడింగ్ కాంప్రహెన్షన్ క్యాట్‌లోఎక్కువ స్కోరు సాధించడానికి అవకాశం ఉన్న విభాగం. అభ్యర్థులు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడం అలవర్చుకుంటే ఇందులో రాణించొచ్చు. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారంతో పాటు... ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉన్న అంశాలు, కీలక పదాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీని కోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి వాటి సారాంశాన్ని క్లుప్తంగా రాసుకోవాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానంలో వర్డ్ లెర్నింగ్‌తో వొకాబ్యులరీలో పట్టు సాధించొచ్చు. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవడంతో పాటు వాటి వాడుకలపై అవగాహన పెంచుకోవాలి.
క్యాట్ దరఖాస్తు సరళి
క్యాట్ -2015 వివరాలు
- గత ఏడాది రెండు లక్షల్లోపున్న క్యాట్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది రెండు లక్షలు దాటింది.
- దీంతో క్యాట్ -2015 పరీక్ష రాయబోతున్న విద్యార్థులు కాస్త గట్టి పోటీనే ఎదుర్కోవలసి ఉంటుంది.
- ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానానికి 2009లో రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి క్యాట్ దరఖాస్తుల సరళిని పరిశీలిస్తే క్యాట్-2015కు వచ్చిన దరఖాస్తుల సంఖ్యే అధికం.
- అయితే దరఖాస్తుల సంఖ్యను చూసి ఔత్సాహిక విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర ఆందోళన తుది ఫలితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
- పోటీకి తగ్గట్టు ప్రిపరేషన్ పరంగా పదునైన వ్యూహాలతో ముందుకెళ్తే విజయం కష్టం కాదనేది నిపుణుల మాట.
- గతానికి భిన్నంగా అనేక మార్పులతో క్యాట్ 2015 నోటిఫికేషన్ విడుదలైంది.
- మార్పుల ప్రభావం ఫలితాలపై పడకుండా ఉండాలంటే అభ్యర్థులు ప్రధానంగా టైం మేనేజ్‌మెంట్, సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్‌లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
- అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్ (ప్రిపరేషన్ పరంగా) చేసుకోవాలి.
- క్యాట్ ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి విజయంలో టైం మేనేజ్‌మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.
- ప్రతి సెక్షన్‌ను 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలనే నిబంధన ఉంది. దీంతో క్యాట్‌లో టైం మేనేజ్‌మెంట్ విస్మరించలేని అంశంగా మారింది.
- ఇప్పటి నుంచి పరీక్ష తేదీ (నవంబర్ 29) వరకు ఉన్న సమయాన్ని అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా ప్రిపరేషన్ పరంగా విభజించుకోవాలి.
- సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో పూర్తి చేయని చాప్టర్లుంటే.. వాటిని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసే విధంగా ఆయా అంశాలకు సమయాన్ని కేటాయించాలి .
- మూడు సెక్షన్లకు మూడు గంటలు చొప్పున రోజుకు మొత్తం 9 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. వారానికి రెండు మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. మొత్తం మీద కనీసం 10 నుంచి 12 మాక్ టెస్ట్‌లకు హాజరై వాటిలో చూపిన ప్రదర్శన ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై కొంత ఎక్కువ దృష్టి పెట్టాలి.
- అన్ని సబ్జెక్ట్‌లకు ప్రిపరేషన్ పరంగా సమతుల్యత ఉండే విధంగా చూసుకోవాలి. నవంబర్ మొదటి వారం నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి.
సెక్షన్ 1:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
- ఈ సెక్షన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంశాలతో ముడిపడి ఉంటుంది. కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలిగే నేర్పు సొంతం చే సుకుంటే ఈ సెక్షన్‌లో రాణించవచ్చు.
- నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాబబిలిటీ అండ్ పెర్ముటేషన్స్/ కాంబినేషన్స్, నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి.
- క్యాట్‌లో 10 శాతం ప్రశ్నలు బేసిక్స్ ఆధారంగా చేసుకుని సొంత ఆలోచనతో సమాధానాలు గుర్తించే విధంగా ఉంటాయి. అభ్యర్థుల సమయం ఇక్కడే ఎక్కువగా వృథా అవుతోంది.
- కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా డెరైక్ట్ బేసిక్స్ ఆధారంగా ఉండే ప్రశ్నల విషయంలో ఎక్కువ దృష్టి సారించాలి. అంటే ఫార్ములా బేస్డ్ ప్రశ్నల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సెక్షన్-2:
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్:
- డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లోగ్రాఫ్, చార్ట్‌లలో ఇచ్చిన డేటాకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థుల స్వీయ విశ్లేషణ, సూక్ష్మ పరిశీలనల ఆధారంగా సమాధానం రాబట్టేవిగా ఉంటాయి.
- గ్రాఫ్, చార్ట్‌లలో ఇచ్చిన దత్తాంశాలపై నేరుగా ప్రశ్నలు అడగకుండా సంబంధిత కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని ఏ ఫార్ములా ఆధారంగా సమాధానం కనుక్కోగలమనే విధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. దీనికి సంబంధించి క్యాట్ స్టాండర్డ్ మెటీరియల్ లేదా ఆన్‌లైన్ టెస్ట్‌ల్లోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
సెక్షన్-2లో మరో ఉప విభాగం వెర్బల్ ఎబిలిటీ. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు స్పీడ్ రీడింగ్‌ను అలవర్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే అందులోని కీలక అంశాలను గుర్తించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబ్యులరీలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్
రీడింగ్ కాంప్రహెన్షన్ క్యాట్‌లోఎక్కువ స్కోరు సాధించడానికి అవకాశం ఉన్న విభాగం. అభ్యర్థులు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడం అలవర్చుకుంటే ఇందులో రాణించొచ్చు. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారంతో పాటు... ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉన్న అంశాలు, కీలక పదాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీని కోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి వాటి సారాంశాన్ని క్లుప్తంగా రాసుకోవాలి. ప్రిఫిక్స్, సఫిక్స్ విధానంలో వర్డ్ లెర్నింగ్‌తో వొకాబ్యులరీలో పట్టు సాధించొచ్చు. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 కొత్త పదాలను నేర్చుకోవడంతో పాటు వాటి వాడుకలపై అవగాహన పెంచుకోవాలి.
క్యాట్ దరఖాస్తు సరళి
సంవత్సరం | దరఖాస్తులు | హాజరు |
2009 | 2.42 లక్షలు | 2.16 లక్షలు |
2010 | 2.04 లక్షలు | 1.86 లక్షలు |
2011 | 2.05 లక్షలు | 1.85 లక్షలు |
2012 | 2.14 లక్షలు | 1.91 లక్షలు |
2013 | 1.96 లక్షలు | 1.94 లక్షలు |
2014 | 1.89 లక్షలు | 1.68 లక్షలు |
2015 | 2.18 లక్షలు | --- |
క్యాట్ -2015 వివరాలు
- పరీక్ష తేదీ: నవంబర్ 29
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: అక్టోబర్ 25 నుంచి ప్రారంభం.
- పరీక్ష వ్యవధి: మూడు గంటలు (ప్రతి విభాగానికి గంట)
విభాగాలు | ప్రశ్నలు |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 34 |
డీఐ అండ్ ఎల్‌ఆర్ | 32 |
వీఆర్ అండ్ ఆర్‌సీ | 34 |
మొత్తం | 100 |
సీట్లు పెరగడమే ప్రధాన కారణం ఐఐఎంలలో సీట్ల సంఖ్య పెరగడమే... క్యాట్-2015కు దరఖాస్తులు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఉన్న ఐఐఎంలలో ఆయా ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను పెంచడం; కొత్త ఐఐఎంలు నెలకొల్పడం వంటి చర్యల ఫలితంగా వచ్చే విద్యా సంవత్సరానికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2016-18 సంవత్సరానికి 19 ఐఐఎంలలో దాదాపు 5 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్లేస్‌మెంట్స్ పరంగా చాలా క్యాంపస్‌లు వంద శాతం రిజల్ట్స్ సాధించాయి. ఈ అంశం కూడా విద్యార్థులను క్యాట్ పరీక్ష వైపు ఆక ర్షించేందకు దోహదపడింది. - ప్రొఫెసర్ రాజేంద్ర కె.బండి, డెరైక్టర్, అడ్మిషన్స్, ఐఐఎం-బెంగళూరు |
స్పీడ్ కాలిక్యులేషన్‌తో విజయవంతంగా క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ఇప్పటి నుంచే రివిజన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రశ్నలకు త్వరగా సమాధానాలు గుర్తించేందుకు స్పీడ్ కాలిక్యులేషన్ అలవర్చుకోవాలి. రీడింగ్, కాలిక్యులేషన్‌లలో స్పీడ్ ప్రాక్టీస్ అవసరం. ఈ ఏడాది క్యాట్‌లో ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి దాని ద్వారా బేసిక్ కాలిక్యులేషన్స్ చేద్దాం అనే ధోరణి సరికాదు. ప్రతిదానికి ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్‌పై ఆధారపడితే సమయం వృథా అవుతుంది. కాబట్టి మెంటల్ కాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి. నవంబర్ మొదటి వారం నుంచి మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం ఎంతో ఉపకరిస్తుంది. -రామ్‌నాథ్ ఎస్.కనకదండి, క్యాట్ కోర్స్ డెరైక్టర్ - టైమ్ ఇన్‌స్టిట్యూట్ |
Published date : 17 Oct 2015 11:45AM