Skip to main content

MBA Entrance‌: IIFT ప్రవేశ పరీక్ష... సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ టిప్స్‌..

IIFT Exam Preparation Strategy, Syllabus Analysis
IIFT Exam Preparation Strategy, Syllabus Analysis

దేశంలోని ప్రముఖ బీస్కూల్‌.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ). ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన అటానమస్‌ విద్యా సంస్థ. డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ హోదా పొందిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు జాతీయ స్థాయిలో ప్రతి ఏటా వేల మంది పోటీపడుతుంటారు. అందుకే క్యాట్‌ తర్వాత అంతటి గుర్తింపు కలిగిన ఎంబీఏ ఎంట్రెన్స్‌గా ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ) పేరొందింది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా.. గ్రూప్‌ డిస్కషన్, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి.. ఐఐఎఫ్‌టీలో.. ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌(ఐబీ) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం 2022–24 బ్యాచ్‌కు సంబంధించి ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ)ను డిసెంబర్‌ 5వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌..

  • డిసెంబర్‌ 5వ తేదీన ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్ష
  • ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ప్రవేశం

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఐబీ పరీక్షను ఆన్‌లైన్‌(సీబీటీ–కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు(రెండు గంటలు). ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలుంటాయి. దేశవ్యాప్తంగా 68 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌లో ప్రశ్న పత్రం ఉంటుంది.

నాలుగు విభాగాలు

క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌–25 ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ వెర్బల్‌ ఎబిలిటీ –35 ప్రశ్నలు, డేటాఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌–30 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 

నెగిటివ్‌ మార్క్‌

మొదటి మూడు సెక్షన్‌లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్‌కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున లభిస్తాయి. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోతను విధిస్తారు.

సిలబస్‌ విశ్లేషణ

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ వెర్బల్‌ ఎబిలిటీ

ఈ విభాగం నుంచి మొత్తం 35ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్‌ క్వశ్చన్స్, ఫిల్‌ ఇన్‌ బ్లాక్స్, సినానియమ్స్‌–యాంటోనియమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్, స్పెల్లింగ్, మ్యాచింగ్‌ వర్డ్‌ మీనింగ్, ఫిగర్‌ ఆఫ్‌ స్పీచ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్‌ కాంప్రహెన్సన్‌ నుంచే 14–16 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నాలుగు ప్యాసెజ్‌లు ఇస్తారు. కరెంట్‌ అఫైర్స్‌–బిజినెస్‌ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, అంతర్జాతీయ పరిణామాలు, అవి దేశంపై చూపుతున్న ప్రభావం తదితర అంశాలపై ప్యాసేజీలు వస్తాయి.

క్వాంటిటేటివ్‌ అనాలసిస్‌

ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్‌ , సింపుల్‌ ఇంట్రెస్ట్, మ్యాన్‌ డే అండ్‌ వర్క్, రేషియో, కాస్ట్, పర్సంటేజెస్, ఫిలింగ్‌ ఆఫ్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నుంచి ప్రశ్నలుంటాయి. వీటితోపాటు జామెట్రీ, అల్జీబ్రా, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

డేటా ఇంటర్‌ప్రిటిషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌

ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్‌ అండ్‌ కంపరేటివ్‌ స్టడీ ఆఫ్‌ డేటా టేబుల్స్, చార్ట్స్‌ అండ్‌ గ్రాఫ్స్‌ విత్‌ టేబుల్స్, పై చార్ట్‌ అండ్‌ టేబుల్, బార్‌ డయాగ్రమ్‌ అండ్‌ కంపరేటివ్‌ టేబుల్‌ వంటి అంశాలు ఉంటాయి. అలాగే లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించి టీమ్‌ బేస్డ్‌ క్వశ్చన్స్, స్టేట్‌మెంట్‌–కంక్లూజన్, కోడింగ్‌ –డీకోడింగ్, ఆర్గుమెంట్, కంక్లూజన్స్, బ్లడ్‌ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్‌ సెన్స్, సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌పై ప్రశ్నలు అడుగుతారు.

జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్‌ ది లోగోస్, మేక్‌ ఇన్‌ ఇండియా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, మ్యాచింగ్‌ స్టాక్‌ మార్కెట్స్‌–కంట్రీస్, కరెన్సీ ఆఫ్‌ ది కంట్రీ, కరెంట్‌ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్‌ అంబాసీడర్లుగా వ్యవహ రిస్తున్నవారు, బుక్స్‌ అండ్‌ ఆథర్స్, బిజినెస్‌ అండ్‌ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

ప్రిపరేషన్‌ టిప్స్‌

  • పరీక్షను డిసెంబర్‌ 5వ తేదీన నిర్వహించనున్నారు. అంటే..పరీక్షకు 10 రోజుల  సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్‌కు కేటాయించడం మేలు. 
  • మ్యాథమెటిక్స్‌లో షార్ట్‌కట్స్‌ను,ఫార్ములాలను, ట్రిక్స్‌ను ఉపయోగించాలి.ఇలా చేయడం ద్వారా వేగంగా ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేసే వీలుంటుంది. 
  • జనరల్‌ నాలెడ్జ్‌ విభాగానికి సంబంధించి ఇంతముందు రాసుకున్న షార్ట్‌కట్‌ నోట్స్,లేదా మ్యాగజైన్స్,న్యూస్‌ పేపర్స్‌ వంటివి రివిజన్‌ చేయాలి.
  • అలాగే ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్, వొకాబ్యులరీని చూసుకోవాలి. 
  • ప్రతి విభాగానికి 1–2 రెండు గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. నిద్రకు కూడా తగినంత సమయాన్ని కేటాయించాలి.
  • పరీక్ష రోజు పరీక్ష కేంద్రంలో సమాధానాలు గుర్తించడం ప్రారంభించకముందే.. ∙ప్రశ్నపత్రాన్ని ఒకసారి పూర్తిగా చదవాలి.
  • సరైన సమాధానం ఇవ్వగలను అనే నమ్మకం ఉన్న ప్రశ్నలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. క్లిష్టమైన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించడం సరికాదు. దీనివల్ల తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సమయం సరిపోదు.
  • వెబ్‌సైట్‌: https://www.iift.ac.in


చ‌ద‌వండి: ఐఐఎంల్లో గ్రూప్‌ డిస్కషన్స్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వూ.. ప్రిప‌రేష‌న్ సాగించండిలా..

Published date : 25 Nov 2021 05:30PM

Photo Stories