ఐఐటీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు..!
Sakshi Education
ఐఐటీలు.. నాణ్యమైన టెక్నికల్ విద్యకు కేరాఫ్.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యున్నత విద్యా సంస్థలు. ఇవి ఇంజనీరింగ్ కోర్సులకే పరిమితం కాకుండా మేనేజ్‌మెంట్ విద్యను అందించడంలోనూ ముందుంటున్నాయి. ఐఐఎంలకు దీటుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వివిధ ఐఐటీల్లో అందుబాటులో ఉన్న ఎంబీఏ ప్రోగ్రామ్‌లపై ఫోకస్..
‘‘టెక్నికల్ స్కిల్స్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ తోడైతే భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించేందుకు, అదే విధంగా నిర్వహణ పరంగా ఒక సంస్థలో అన్ని విభాగాలపైనా పట్టు సాధించేందుకు వీలుంటుంది’’ .
మేనేజ్‌మెంట్ విద్యార్థులకు టెక్నికల్ నైపుణ్యాల విషయంలో నిపుణుల అభిప్రాయమిది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం వివిధ ఐఐటీలు అడుగులు వేస్తున్నాయి. తమ క్యాంపస్‌ల్లో ఇంజనీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. తాజా గ్రాడ్యుయేట్ల నుంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్ వరకు.. వివిధ స్పెషలైజేషన్లలో ఎంబీఏ, ఈఎంబీఏ పేరుతో కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రస్తుతం ఏడు ఐఐటీల్లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.
ఐఐఎంలకు దీటుగా..
క్యాట్ తప్పనిసరి :
ఐఐటీల్లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు కూడా తప్పనిసరిగా క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) లో ఉత్తీర్ణత సాధించి మంచి స్కోర్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మలిదశలో నిర్వహించే రిటెన్ ఎబిలిటీ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్; పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలి. అభ్యర్థులు ప్రతి ఐఐటీకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఆయా ఐఐటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి.
ర్యాంకింగ్స్‌లో చోటు :
ఐఐటీలు - ఎంబీఏ ప్రోగ్రామ్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరో అంశం.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో (మేనేజ్‌మెంట్ విభాగంలో)నూ ఐఐటీలు చోటు సంపాదిస్తుండటం. ఇటీవల విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐటీ-ముంబై 101-150 శ్రేణిలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ (151-200); ఐఐటీ-చెన్నై (251-300) కూడా చోటు సంపాదించాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ - బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ ఐఐటీలు చోటు సంపాదించాయి.
ఎంబీఏను ఆఫర్ చేస్తున్న ఐఐటీలు...
ఐఐటీ ఖరగ్‌పూర్ :
ఇది వినోద్ గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి.. ఎంబీఏను అందిస్తోంది.
మొత్తం సీట్లు : 140
ఐఐటీ - చెన్నై :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రెండేళ్ల వ్యవధిలో ఎంబీఏ కోర్సు అందిస్తోంది. ఫైనాన్స్, హెచ్‌ఆర్ అండ్ ఓబీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంటిగ్రేటివ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం సీట్లు : 60.
వెబ్‌సైట్: https://doms.iitm.ac.in
ఐఐటీ కాన్పూర్ :
ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో 21 నెలల వ్యవధిలో ఎంబీఏ ప్రోగ్రామ్ అందిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్‌మెంట్, సర్వీస్ మేనేజ్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం సీట్లు : 80.
వెబ్‌సైట్: www.iitk.ac.in/ime
ఐఐటీ-ముంబై :
ఇది శైలేశ్ జె. మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ఎంబీఏ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్; క్వాంటిటేటివ్ టెక్నిక్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటిం గ్, జనరల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ అండ్ ఓబీ, ఇంటర్నేషనల్ బిజినెస్ తదితర ఎలక్టివ్స్‌ను అందుబాటులో ఉంచింది.
మొత్తం సీట్లు : 123.
వెబ్‌సైట్: www.som.iitb.ac.in
ఐఐటీ- ఢిల్లీ :
ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పరిధిలో ఎంబీఏ, ఎంబీఏ (టెలికం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్) కోర్సులను అందిస్తోంది. ఎంబీఏలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫైనాన్స్, మార్కెటింగ్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://dms.iitd.ac.in/mba-full-admission.html
ఐఐటీ - రూర్కీ :
ఐఐటీ రూర్కీ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ద్వారా ఎంబీఏ కోర్సును అందిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆపరేషన్స్, హెచ్‌ఆర్ ఎం స్పెషలైజేషన్లు అందుబాటు లో ఉన్నాయి.
మొత్తం సీట్లు : 95.
వెబ్‌సైట్: www.iitr.ac.in
ఐఎస్‌ఎం-ధన్‌బాద్ :
ఐఐటీ హోదా పొందిన ఐఎస్ ఎం-ధన్‌బాద్ కూడా ఎంబీఏ ప్రోగ్రామ్ అందిస్తోంది. మార్కె టింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలై జే షన్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.iitism.ac.in

- ఐఐటీలు అందిస్తున్న ఎంబీఏలో రెండో ఏడాది ఎంపిక చేసుకోవాల్సిన స్పెషలైజేషన్లు ప్రత్యేకత చాటుకుంటున్నాయి. మేనేజ్‌మెంట్, టెక్నికల్ నైపుణ్యాలు రెండూ లభించేలా ఈ స్పెషలైజేషన్లు ఉంటున్నాయి. ఉదాహరణకు ప్రొడక్షన్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లతో ఔత్సాహికులు పూర్తిస్థాయి నైపుణ్యాలు పొందొచ్చు. వీటి ఆధారంగా నిర్వహణ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపైనా అవగాహన లభిస్తుంది. వాస్తవానికి ఇతర బి-స్కూళ్లలోనూ ఈ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి కేవలం మేనేజ్‌మెంట్ విభాగాలకే పరిమితం అవుతున్నాయి.
ఐఐఎంలకు దీటుగా..
- మేనేజ్‌మెంట్ విద్యను అయిదారేళ్ల క్రితమే ప్రారంభించిన ఐఐటీలు ఈ స్వల్ప వ్యవధిలోనే.. ఐఐఎంలకు దీటుగా రాణిస్తూ.. విద్యార్థులను పూర్తిస్థాయి బిజినెస్ ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఎంబీఏ ప్రోగ్రామ్ అందుబాటులో ఉన్న ఐఐటీల ప్లేస్‌మెంట్స్ గణాంకాలే దీనికి నిదర్శనం.
- ప్లేస్‌మెంట్స్ పరంగా ఐఐటీల్లో ఎంబీఏ విద్యార్థులకు 90 శాతం మందికి ఆఫర్లు ఖరారవుతున్నాయి. వేతన ప్యాకేజీలూ ఐఐఎంల తరహాలోనే ఉంటున్నాయి. ఐటీ, కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించే సంస్థలకు అవసరమైన నైపుణ్యాలున్న విద్యార్థులు లభిస్తున్నారు.
క్యాట్ తప్పనిసరి :
ఐఐటీల్లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు కూడా తప్పనిసరిగా క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) లో ఉత్తీర్ణత సాధించి మంచి స్కోర్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మలిదశలో నిర్వహించే రిటెన్ ఎబిలిటీ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్; పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలి. అభ్యర్థులు ప్రతి ఐఐటీకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఆయా ఐఐటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి.
ర్యాంకింగ్స్‌లో చోటు :
ఐఐటీలు - ఎంబీఏ ప్రోగ్రామ్‌కు సంబంధించి చెప్పుకోవాల్సిన మరో అంశం.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో (మేనేజ్‌మెంట్ విభాగంలో)నూ ఐఐటీలు చోటు సంపాదిస్తుండటం. ఇటీవల విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐటీ-ముంబై 101-150 శ్రేణిలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ (151-200); ఐఐటీ-చెన్నై (251-300) కూడా చోటు సంపాదించాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ - బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ ఐఐటీలు చోటు సంపాదించాయి.
ఎంబీఏను ఆఫర్ చేస్తున్న ఐఐటీలు...
ఐఐటీ ఖరగ్‌పూర్ :
ఇది వినోద్ గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి.. ఎంబీఏను అందిస్తోంది.
మొత్తం సీట్లు : 140
- 2016-18 బ్యాచ్‌కు సంబంధించి ఇప్పటివరకు 111 మందికి ప్లేస్‌మెంట్స్ లభించాయి. సగటు వార్షిక వేతనం రూ.15 లక్షలుగా నమోదైంది.
ఐఐటీ - చెన్నై :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రెండేళ్ల వ్యవధిలో ఎంబీఏ కోర్సు అందిస్తోంది. ఫైనాన్స్, హెచ్‌ఆర్ అండ్ ఓబీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంటిగ్రేటివ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం సీట్లు : 60.
వెబ్‌సైట్: https://doms.iitm.ac.in
ఐఐటీ కాన్పూర్ :
ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో 21 నెలల వ్యవధిలో ఎంబీఏ ప్రోగ్రామ్ అందిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్‌మెంట్, సర్వీస్ మేనేజ్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం సీట్లు : 80.
వెబ్‌సైట్: www.iitk.ac.in/ime
ఐఐటీ-ముంబై :
ఇది శైలేశ్ జె. మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ఎంబీఏ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్; క్వాంటిటేటివ్ టెక్నిక్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటిం గ్, జనరల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ అండ్ ఓబీ, ఇంటర్నేషనల్ బిజినెస్ తదితర ఎలక్టివ్స్‌ను అందుబాటులో ఉంచింది.
మొత్తం సీట్లు : 123.
వెబ్‌సైట్: www.som.iitb.ac.in
ఐఐటీ- ఢిల్లీ :
ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పరిధిలో ఎంబీఏ, ఎంబీఏ (టెలికం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్) కోర్సులను అందిస్తోంది. ఎంబీఏలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫైనాన్స్, మార్కెటింగ్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://dms.iitd.ac.in/mba-full-admission.html
ఐఐటీ - రూర్కీ :
ఐఐటీ రూర్కీ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ద్వారా ఎంబీఏ కోర్సును అందిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆపరేషన్స్, హెచ్‌ఆర్ ఎం స్పెషలైజేషన్లు అందుబాటు లో ఉన్నాయి.
మొత్తం సీట్లు : 95.
వెబ్‌సైట్: www.iitr.ac.in
ఐఎస్‌ఎం-ధన్‌బాద్ :
ఐఐటీ హోదా పొందిన ఐఎస్ ఎం-ధన్‌బాద్ కూడా ఎంబీఏ ప్రోగ్రామ్ అందిస్తోంది. మార్కె టింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలై జే షన్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.iitism.ac.in
Published date : 31 Mar 2018 12:45PM