Skip to main content

ఆయా రాష్ట్రాలకు సొంతంగా ఎంట్రన్స్‌లు.. విచక్షణ మేరకే ఏఐసీటీఈ నిబంధనలు అమలు..

ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం సొంత ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించి.. అందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు అర్హత ఇంటర్‌ తత్సమాన కోర్సులో ఎంపీసీ ఉత్తీర్ణత. ఏఐసీటీఈ ఆయా రాష్ట్రాల విచక్షణ మేరకే తమ సూచనలు పాటించొచ్చని పేర్కొంది. సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే రాష్ట్రాలు అర్హతల విషయంలో స్వీయ నిబంధనలు రూపొందించొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లకు ఇంటర్‌ ఎంపీసీ ఉత్తీర్ణత నిబంధన కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఈ ఏడాది ఏఐసీటీఈ సంస్కరణలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఇప్పటికే తేదీలు ప్రకటిం చినందున ఎంసెట్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

బ్రిడ్జ్‌ కోర్సులతో కష్టమే..
బీటెక్‌లో చేరడానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఐచ్ఛికం అని పేర్కొన్న ఏఐసీటీఈ.. విద్యార్థులు వాటికి సంబంధించిన బేసిక్‌ నైపుణ్యాలు పొందేందుకు బీటెక్‌/బీఈ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్‌ కోర్సులు నిర్వహించొచ్చని సిఫార్సు చేసింది. ఈ బ్రిడ్జ్‌ కోర్సులతో సదరు నైపుణ్యాలు లభిస్తాయా అంటే? కాదనే సమాధానం వినిపిస్తోంది. వీటివల్ల ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాల కాన్సెప్ట్‌లపై అవగాహన లభిస్తుందే తప్ప.. పూర్తి స్థాయి పట్టు సాధించడం కష్టమంటున్నారు. ఇంజనీరింగ్‌కు పునాదిగా భావించే మ్యాథ్స్‌లోని కాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సహా పలు కీలకమైన టాపిక్స్‌ను; అదే విధంగా ఫిజిక్స్‌లో మ్యాగ్నటిజం, ఎలక్ట్రో మ్యా గ్నటిజం, థర్మో డైనమిక్స్, మెకానిక్స్‌ తదితర 20కు పైగా టాపిక్స్‌ను ఇంటర్‌లో రెండేళ్ల పాటు అభ్యసిస్తే తప్ప విద్యా ర్థులకు వాటిపై అవగాహన రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకట్రెండు సెమిస్టర్లలో నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సు ద్వారా అవస రమైన నైపుణ్యాలు లభించడం కష్టమే అంటున్నారు నిపుణులు.

ఇంకా చదవండి: part 3: పరిశోధనలతో పాటు విదేశీ విద్యకు భవిష్యత్తులో సమస్యలు..?

Published date : 27 Mar 2021 05:08PM

Photo Stories