Army Jobs: ఇంజనీరింగ్‌తో ఆర్మీ ఆఫీసర్
- టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ నోటిఫికేషన్
- బీటెక్ పట్టభద్రులకు చక్కటి అవకాశం
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసుకొని దేశానికి సేవచేయాలని తపించే వారికోసం ఆర్మీ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. 40 ఆఫీసర్స్ స్థాయి పోస్టులను పర్మనెంట్ కమిషన్ కింద భర్తీ చేయనుంది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ).. ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి శిక్షణ సమయంలోనే రూ.56100 స్టైపెండ్ అందిస్తారు.
∙మొత్తం పోస్టుల సంఖ్య: 40
- ∙పోస్టుల వివరాలు: సివిల్/బిల్డింగ్ కన్సస్ట్రక్షన్ టెక్నాలజీ–09, ఆర్కిటెక్చర్–01, మెకానికల్–05, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ–03, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్–08, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–03, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్–01, టెలీకమ్యూనికేషన్స్–01, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్–02, ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఏవియానిక్స్–01, ఎలక్ట్రానిక్స్–01, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్/ఇనుస్ట్రుమెంటేషన్–01, ప్రొడక్షన్–01, ఇండస్ట్రియల్/ మాన్యు ఫ్యాక్చరింగ్–01, ఆప్టో ఎలక్ట్రానిక్స్–01, ఆటో మొబైల్ ఇంజనీరింగ్–01.
- అర్హతలు
- ∙అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు జూలై 01, 2022 నాటికి అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మార్కుషీట్‌లతోపాటు ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే శిక్షణ ప్రారంభించిన తేదీ నుంచి 12 వారాలలోపు ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాలి.
- ∙వయసు: జూలై 01, 2021 నాటికి 20–27ఏళ్ల మ ధ్య వయసు కలిగి ఉండాలి. జూలై 02,1995 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
Also read: NDA-NA Preparation:ఎన్‌డీఏ, ఎన్‌ఏ..రాత పరీక్ష ఇలా
ఎంపిక విధానం
ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మార్కులకు కటాఫ్ నిర్ణయిస్తారు. బీటెక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను అలహాబాద్ (ఉత్తరప్రదేశ్), భోపాల్(మధ్యప్రదేశ్), బెంగళూర్ (కర్ణాటక), కపుర్తాలా(పంజాబ్)లలో ఎస్‌ఎస్‌బీ.. సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించిన వారికి వైద్యపరీక్షలను నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ ఇలా
అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో శిక్షణ ఇస్తారు. 49 వారాల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు పర్మినెంట్ కమిషన్ పరిధిలోకి వస్తారు. వీరికి నిబంధనల ప్రకారం వేతనం అందిస్తారు.
Also read: CAT-2021: క్యాట్.. కటాఫ్ తగ్గనుందా!
కెరీర్ స్కోప్
ఈ విభాగంలో శిక్షణ అనంతరం మంచి వేతనాలు, డీఏ, హెచ్‌ఆర్‌ఏతోపాటు ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారం భించిన రెండేళ్లకు కెప్టెన్, ఆరేళ్లకు మేజర్, పదమూ డేళ్లకు లెఫ్టినెంట్ కల్నల్, ఇరవై ఆరేళ్లకు కల్నల్.. ఇలా వివిధ హోదాల్లో పదోన్నతులు పొందుతారు. పనితీరు ఆధారంగా ఆయా విభాగానికి అధిపతి కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
వేతనం
లెఫ్టినెంట్ హోదాతో విధులు నిర్వహించే వారికి ప్రాథమిక వేతనం నెలకు రూ.56,100– రూ.1,77,000 వరకు లభిస్తుంది. అనుభవంతో.. పదోన్నతులు, వేతనాల్లో పెరుగుదల ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
- ∙దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ∙దరఖాస్తులకు చివరి తేదీ: 04.01.2022
- ∙వెబ్‌సైట్: ww.joinindianarmy.nic.in.