NDA-NA Preparation:ఎన్‌డీఏ, ఎన్‌ఏ..రాత పరీక్ష ఇలా
Sakshi Education
- ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను రెండు పేపర్లలో మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1లో మ్యాథ మెటిక్స్ 300 మార్కులకు; పేపర్ 2లో జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులకు ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష సమయం రెండున్నర గంటలు. çపరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.
- పేపర్–2గా నిర్వహించే జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో పార్ట్–ఎ పేరుతో 200 మార్కులకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ విభాగంపై ప్రశ్నలు ఉంటాయి.
- జనరల్ నాలెడ్జ్ విభాగం పేరుతో పార్ట్–బిని నిర్వహిస్తారు. పార్ట్–బికి 400 మార్కులుం టాయి. ఇందులో మొత్తం ఆరు విభాగాలు (ఫిజిక్స్; కెమిస్ట్రీ; జనరల్ సైన్స్; హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం; జాగ్రఫీ; కరెంట్ ఈవెంట్స్) నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి విభాగానికి సంబంధించి నిర్దిష్టంగా వెయి టేజీని పేర్కొన్నారు. ఫిజిక్స్‌కు 25 శాతం; కెమిస్ట్రీకి 15శాతం, జనరల్ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20శాతం, కరెంట్ ఈ వెంట్స్‌కు పది శాతం వెయిటేజీ కల్పించారు. ఈ వెయిటేజీ ప్రకారమే ఆయా విభాగాల్లో ప్రశ్నల సంఖ్య, మార్కులు ఉంటాయి.
- పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే పేపర్–1, పేపర్–2లలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.
Also read : NDA - NA Exam 2022 : చదువు + కొలువు (ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్ )
మలి దశలో ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ
- ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలి దశలో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, రాత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా.. నిర్దేశిత విభాగం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌బీ (సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది.
- ఎయిర్‌ఫోర్స్ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీ తర్వాత నిర్వహించే కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది.
క్లిష్టంగా ఎస్‌ఎస్‌బీ
- అభ్యర్థులు త్రివిధ దళాలకు సరితూగుతారా.. లేదా.. అని పరిశీలించేందుకు నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ క్లిష్టంగానే ఉంటుంది. అభ్యర్థుల్లో మానసిక, శారీరక ద్రుఢత్వాన్ని పరీక్షిస్తారు. మొత్తం 900 మార్కులకు జరిగే ఎస్‌ఎస్‌బీలో ఇంటెలిజెన్స్ టెస్ట్, వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ లెస్ట్, సామాజిక అంశాలపై అభ్యర్థుల అవగాహనను, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధంగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్టన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం అయిదు రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది.
Also read: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్ పైలట్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
విజయానికి కదలండిలా
- ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న అంశాల వారీగా పట్టు సాధించాల్సి ఉంటుంది.
- పేపర్–1 మ్యాథమెటిక్స్ పూర్తిగా కాన్సెప్ట్స్ ఆధారితంగా ఉంటుంది. ఇందులో మంచి మార్కులు సాధించాలంటే.. అల్జీబ్రా,మ్యా ట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అనలిటికల్ జా మెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబ బిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సా« దించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా మేలు చేస్తుంది. బేíసిక్ ప్రిన్సిపుల్స్, వివిధ సిద్ధాం తాలు, సూత్రాలు, ఫార్ములాలపై పట్టు సా ధించాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- పేపర్–2 జనరల్ ఎబిలిటీకి సంబంధించి.. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్; వొకాబ్యులరీ రీడింగ్ కాంప్రహెన్షన్‌లనై పట్టు సాధించాలి.
- జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫై ర్స్‌లను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైన మిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- కెమిస్ట్రీలో కెమికల్ అనాలసిస్, ఇనార్గానిక్ కాం పౌండ్స్, పిరియాడిక్ టేబుల్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోౖ డెనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్‌పై ప్రధా నంగా దృష్టి సారించాలి.
- జనరల్ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్ కింగ్ డమ్‌లపై అవగాహన పెంచుకోవాలి.
- కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష జరిగే తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలోని అన్ని సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి.
- హిస్టరీ విభాగానికి సంబంధించి.. స్వాతం త్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి.
- జాగ్రఫీలో ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది.
- ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను కూలంకషంగా చదవాలి. తద్వారా ఆయా అంశాల నుంచి అడిగే ప్రశ్నల్లో అధిక శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఆస్కారం లభిస్తుంది.
Latest Careers
Published date : 27 Dec 2021 05:22PM