Skip to main content

Siachen Base Camp: సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబర్ 26వ తేదీ లద్దాఖ్‌లోని సియాచిన్ బేస్ క్యాంప్‌ను సందర్శించారు.
President Droupadi Murmu visits Siachen Base Camp

ఈ సందర్భంగా ఆమె అక్క‌డ‌ ఉన్న‌ సైనికులకు ఉత్సాహాన్ని నింపే ప్రసంగం చేశారు. ‘భారీ మంచుపాతం, మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వంటి ప్రతికూల పరిస్థితుల్లో మాతృభూమి రక్షణ కోసం మీ చాటుతున్న త్యాగం, సాహసం అసాధారణం. సైనిక బలగాల సుప్రీం కమాండర్‌గా మీ సేవలను చూసి గర్వపడుతున్నా’ అని ఆమె చెప్పారు. 

ఈ సందర్భంగా ముర్ము సైనిక దుస్తులు ధరించి, సియాచిన్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించారు. 1984లో జరిగిన ఆపరేషన్ మేఘ్ దూత్‌లో అమరులైన సైనికుల త్యాగాన్ని ఆమె కొనియాడారు.

ఈ సందర్శనతో.. సియాచిన్ బేస్ క్యాంప్‌ను సందర్శించిన మూడో రాష్ట్రపతిగా ముర్ము గుర్తింపు పొందారు. అంతకు ముందు రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్, రామ్‌నాథ్ కోవింద్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ బేస్‌ క్యాంప్‌ కారాకోరం పర్వత శ్రేణిలో 20వేల అడుగుల ఎత్తులో ఉన్నది.  

Unemployment Stats: భార‌త్‌లో అత్యధిక/అత్యల్ప నిరుద్యోగిత రేటు ఉన్న టాప్ 10 రాష్ట్రాలు ఇవే.. 

Published date : 28 Sep 2024 09:41AM

Photo Stories