Skip to main content

Agniveer Army Recruitment Rally: అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ అర్హతలు ఇవే..

agniveer army recruitment rally
agniveer army recruitment rally

కడప సెవెన్‌రోడ్స్‌ : జిలా కేంద్రాల్లో నవంబర్‌ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్మెంట్‌ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల... నెలకు 96వేల జీతం: Click Here

బుధవారం కలెక్టరేట్‌లో ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్మెంట్‌ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్‌ డైరెక్టర్‌ కల్నన్‌ పునీత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ హర్షవర్దన్‌ రాజు, జేసీ అదితి సింగ్‌, రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మేజర్‌ అమర్‌ దీప్‌ కుమార్‌, డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌ లతో కలిసి జిలా కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఇప్పటికే రాత పరీక్ష పూర్తయి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహించేందుకు కడప జిల్లా కేంద్రంలోని జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియం వేదికగా మారనుందన్నారు.

రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్‌ నందన్‌, జిల్లా ఫైర్‌ అధికారి ధర్మారావు, డీటీసీ మీరా ప్రసాద్‌, డీఎంహెచ్‌ఓ డి. నాగరాజు, ఆర్‌అండ్‌బీ డీఈ మాధవి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Sep 2024 05:33PM

Photo Stories