Indian Army : సైనిక దళాలను మరింత బలోపేతానికి రూ.1.45 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లు
Sakshi Education
భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సెప్టెంబర్ 3న సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Port Blair: పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఇదే..
మొత్తం మీద 10 రకాల సాధన సంపత్తి సమీకరణకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసిసిటీ’ (ఏవోఎన్) మంజూరు చేసింది. ఇందులో 99 శాతాన్ని దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. భారత సైన్యంలోని యుద్ధట్యాంకుల ఆధునికీకరణ కోసం భవిష్యత్తరం పోరాట శకటా(ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్–ఎఫ్ ఆర్సీవీ) ల సమీకరణకు సమ్మతి లభించింది.
Published date : 14 Sep 2024 04:17PM