Port Blair: పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఇదే..
Sakshi Education
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం 'పోర్ట్ బ్లెయిర్'ను ఇకపై 'శ్రీ విజయపురం' అని పిలవాలని సెప్టెంబర్ 13వ తేదీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.
భారత స్వాతంత్య్ర పోరాటం, దేశ చరిత్రలో అసాధారణ స్థానం సంపాదించుకున్న ఈ ప్రాంతానికి వలసపాలన నాటి ఆనవాళ్లు ఉండకూడదని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఇది ప్రస్తుతం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంది. 836 దీవులు, అంతకన్నా చిన్న భూభాగాలతో అండమాన్ నికోబార్ ప్రాంతం ప్రకృతి సోయగా లతో ఎంతో రమణీయంగా ఉంటుంది.
550 దీవులు అండమాన్ వైపు, 22 ప్రధాన దీవులు నికోబార్ వైపు ఉంటాయి. వీటిని 150 కి.మీ.ల వెడల్పయిన '10 డిగ్రీల ఛానల్' జలభాగం విడదీస్తుంది. మధ్య ప్రాచీన శిలాయుగం నుంచి ఇక్కడ ప్రజలు నివ సిస్తున్నారు. స్థానిక తెగల ఆవాస విశేషాలు 1850ల్లో తొలిసారిగా బయటి ప్రపంచానికి తెలిశాయి.
Amit Shah: అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా
Published date : 14 Sep 2024 03:28PM