Indian Coast Guard Recruitment: టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో 322 ఉద్యోగాలు
సముద్ర తీర ప్రాంతాల్లో నిరంతరం గస్తీ కాస్తూ.. దేశ భద్రతతోపాటు సముద్ర చట్టాలను పరీరక్షించే భారతీయ తీరగస్తీ దళం(ఇండియన్ కోస్ట్ గార్డ్) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, యాంత్రిక్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా విద్యార్హతలతో వీటికి పోటీపడవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి.. ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 322
- పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)– 260, నావిక్ డొమెస్టిక్(బ్రాంచ్)–35, యాంత్రిక్–27.
విద్యార్హతలు
- నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18–22 ఏళ్ల మ«ధ్య ఉండాలి. - నావిక్ డొమెస్టిక్(బ్రాంచ్): పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 18–22ఏళ్ల మ«ధ్య ఉండాలి. - యాంత్రిక్: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/టెలీ కమ్యూనికేషన్స్(రేడియో/పవర్) ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి‡ ఉండాలి.
వయసు: 01 అక్టోబర్ 2000–30 సెప్టెంబర్ 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం
పోస్టులను అనుసరించి నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు. స్టేజ్1లో రాత పరీక్ష ఉంటుంది. స్టేజ్
2లో ఫిజికల్ ఫిట్‌నెస్ట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి. స్టేజ్ 3లో ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్టేజ్ 4లో ఒరిజినల్ సర్టిఫికెట్లను మరోసారి పరిశీలిస్తారు. సర్టిఫికెట్‌లు సరిగా లేకుంటే.. టెర్మినేట్ చేస్తారు.
పరీక్ష విధానం
- నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): ఈ పోస్టులకు సంబంధించి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. మ్యాథ్స్–20, సైన్స్–10, ఇంగ్లిష్–15, రీజనింగ్–10, జీకే–05 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. పదోతరగతి స్థాయిలో సిలబస్ ఉంటుంది.
- నావిక్(జనరల్ డ్యూటీ): నావిక్ జీడీ అభ్యర్థులు నావిక్ డొమెస్టిక్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే రెండింట్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే జీడీ పరీక్షకు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. మ్యాథ్స్–25 మార్కులు, ఫిజిక్స్–25 మార్కుల చొప్పున 50 మార్కులకు–50 ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్మీడియట్ స్థాయి మ్యాథ్స్, ఫిజిక్స్ సిలబస్ ఉంటుంది.
- యాంత్రిక్: యాంత్రిక్‌లోని మూడు విభాగాలకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు నావిక్(డొమెస్టిక్) పరీక్షతోపాటు సంబంధిత యాంత్రిక్(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్) పరీక్షను రాయాల్సి ఉంటుంది. యాంత్రిక్ పరీక్ష ఒక్కో విభాగంలో 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి విభాగానికి పరీక్ష సమయం 30 నిమిషాలు.
- రెండో దశ(స్టేజ్ 2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. స్టేజ్ 2కు ఎంపిక చేస్తారు. ఈ దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి.
చదవండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం
ఫిజికల్ టెస్ట్
అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెంటీ మీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెంటీ మీటర్లు ఉండాలి. 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్‌లు తీయగలగాలి.
సర్టిఫికేట్ వెరిఫికేషన్
రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఐఎన్‌ఎస్ చిల్కాలో ఫైనల్ మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని ప్రొవిజనల్ షార్ట్‌లిస్ట్‌చేసి.. తుదిగా శిక్షణకు ఎంపిక చేస్తారు. దీన్ని
పూర్తిచేసుకున్న వారికి సంస్థ అవసరాలు, శిక్షణలో చూపిన ప్రతిభ ద్వారా బ్రాంచ్/ట్రేడు కేటాయిస్తారు.
వేతనాలు
నావిక్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ అభ్యర్థులకు విధుల్లో చేరిన తర్వాత ప్రారంభ వేతనం రూ. 21,700 (లెవల్–03) అందుతుంది. యాంత్రిక్‌కు రూ.29,200 (లెవల్–05) మూల వేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు
అదనంగా లభిస్తాయి. వేతనంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు(క్యాంటిన్, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ మొదలైనవి) ఉంటాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 14.01.2022
- వెబ్‌సైట్: https://joinindiancostguard.cdac.in
చదవండి: Defence Courses