Skip to main content

సరికొత్తగా సీఎస్ కోర్సు..

కంపెనీ, కార్పొరేట్ చట్టాల్లో నిరంతరం చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విధుల నిర్వహణకు సరికొత్త నైపుణ్యాలు అందించే కోర్సు కంపెనీ సెక్రటరీస్ (సీఎస్) కోర్సు.
దీన్ని పూర్తిచేసిన వారికి కార్పొరేట్ రంగం, ఇతర ప్రముఖ సంస్థల్లో కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ తదితర హోదాలు లభిస్తున్నాయి. ఈ కోర్సుకు సంబంధించిన కొత్త సిలబస్‌పై ఫోకస్..

మొత్తం మూడు దశల్లో కోర్సు..
కంపెనీ సెక్రటరీస్ కోర్సు మూడు దశల్లో ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. సీఎస్ కోర్సులో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హతతో అడుగుపెట్టొచ్చు. ప్రత్యేక అర్హతలతో (ఉదా: ఫైన్‌ఆర్ట్స్ మినహా ఇతర విభాగాల్లో గ్రాడ్యుయేషన్ ద్వారా) ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో నేరుగా ప్రవేశించొచ్చు.
  • రెండు, మూడు దశల్లో మార్పులు: 2018, మార్చి 1 నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (మాడ్యూల్ 1-4 పేపర్లు; మాడ్యూల్ 2-4 పేపర్లు)కు కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది. అదే విధంగా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ (3 మాడ్యూళ్లలో 9 పేపర్లు)కు 2018, సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిలబస్ అమలవుతుంది.
  • కార్పొరేట్ రంగంలో మారుతున్న పరిస్థితులు, వాటికి అనుగుణంగా ఔత్సాహికులకు నైపుణ్యాలను అందించి, కోర్సు పూర్తయ్యేసరికి పరిపూర్ణ సీఎస్‌లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో సిలబస్‌లో మార్పులు చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) వర్గాలు పేర్కొన్నాయి.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కొత్త సిలబస్..
మాడ్యూల్-1 :
1. జ్యూరిస్ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ అండ్ జనరల్ 'లా'స్.
2. కంపెనీ లా.
3. సెటింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్ (వ్యాపార సంస్థల ఏర్పాటు, మూసివేత).
4. ట్యాక్స్ 'లా'స్.

మాడ్యూల్-2 :

5. కార్పొరేట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్.
6. సెక్యూరిటీస్ 'లా'స్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్.
7. ఎకనామిక్, బిజినెస్ అండ్ కమర్షియల్ 'లా'స్.
8. ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.

ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కొత్త సిలబస్
మాడ్యూల్-1 :
1. గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్సెస్ అండ్ ఎథిక్స్.
2. అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ 'లా'స్.
3. డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అపీయరెన్సెస్.

మాడ్యూల్-2 :
4. సెక్రటేరియల్ ఆడిట్, కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డ్యూ డిలిగెన్స్.
5. కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, ఇన్‌సాల్వెన్సీ, లిక్విడేషన్ అండ్ వైండింగ్ అప్.
6. రిజల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్, నాన్ కంప్లయెన్సెస్ అండ్ రెమిడీస్.

మాడ్యూల్-3 :
7. కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్స్ ఇన్ స్టాక్ ఎక్స్ఛేంజెస్.
8. మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీస్.
9. ఎలక్టివ్ పేపర్.
  • బ్యాంకింగ్- లా అండ్ ప్రాక్టీస్
  • ఇన్సూరెన్స్ - లా అండ్ ప్రాక్టీస్.
  • ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ - లా అండ్ ప్రాక్టీసెస్.
  • ఫోరెన్సిక్ ఆడిట్.
  • డెరైక్ట్ ట్యాక్స్ లా అండ్ ప్రాక్టీస్.
  • లేబర్ 'లా'స్ అండ్ ప్రాక్టీస్.
  • వాల్యుయేషన్స్ అండ్ బిజినెస్ మోడలింగ్.
  • ఇన్‌సాల్వెన్సీ-లా అండ్ ప్రాక్టీస్.
(వీటిలో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి).

ప్రాక్టికల్ శిక్షణ విధానాల్లో మార్పు :
సీఎస్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ సిలబస్‌లో మార్పులు చేసిన ఐసీఎస్‌ఐ.. ఫౌండేషన్ నుంచి ప్రొఫెషనల్ వరకు అమలు చేస్తున్న పలు రకాల శిక్షణ విధానాల్లోనూ మార్పు చేసింది. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్, కంప్యూటర్ ట్రైనింగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్.. యథాతథం
సీఎస్ కోర్సు పూర్తిచేసే క్రమంలో విద్యార్థులు కేవలం రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటీస్‌షిప్ గరిష్ట వ్యవధి మూడేళ్లు. అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారో దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది.
- సీఎస్ కోర్సు పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.icsi.edu

కోర్సుతో కొలువులు..
సీఎస్ కోర్సు పూర్తిచేసి, ఐసీఎస్‌ఐ అసోసియేట్ మెంబర్‌షిప్ పొందిన అభ్యర్థులకు కార్పొరేట్ సంస్థల్లో కంపెనీ సెక్రటరీలు, అసోసియేట్ కంపెనీ సెక్రటరీలు, కంప్లయన్స్ ఆఫీసర్స్ తదితర కీలక హోదాల్లో కొలువులు లభిస్తాయి. అంతేకాకుండా స్వయం ఉపాధి కోణంలోనూ ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా కెరీర్ ప్రారంభించొచ్చు. ఇందులోనూ మంచి ఆదాయం లభిస్తుంది. కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు నిర్దేశిత చట్టాల ప్రకారం.. కంపెనీ ప్రాస్పెక్టస్, ఇతర వివరాలను గుర్తింపు పొందిన కంపెనీ సెక్రటరీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్వయం ఉపాధికి మంచి ఆదరణ నెలకొంది.

కొత్త నైపుణ్యాలు అందించేందుకే..
ఐసీఎస్‌ఐ.. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల సిలబస్‌లో మార్పులు చేయడానికి ప్రధాన కారణం.. విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాలు అందించడమే. ఇటీవల కార్పొరేట్ చట్టాలు, ఇతర అంశాల పరంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు కొత్త సిలబస్‌ను రూపొందించాం. ఈ కోర్సు ఔత్సాహికులు నిరంతర పరిణామాలపై అవగాహనతో అడుగులు వేస్తే ఎన్ని మార్పులు వచ్చినా సులువుగా కెరీర్‌లో రాణించగలరు.
- ఆర్.రామకృష్ణ గుప్తా, చైర్మన్, ఎస్‌ఐఆర్‌సీ-ఐసీఎస్‌ఐ.
Published date : 15 Mar 2018 12:39PM

Photo Stories