త్వరలో సీఏ ఎగ్జామ్స్.. ఇలా ప్రిపేర్ అయితే విజయం సులువు..
వాస్తవానికి చక్కటి ప్రిపరేషన్ ప్లాన్, చిన్నపాటి మెళకువలతో ఈ పరీక్షల్లో తేలిగ్గానే ఉత్తీర్ణత సాధించొచ్చు అంటున్నారు నిపుణులు! తాజాగా.. ఐసీఏఐ.. మే నెల పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల విధానం.. పేపర్ల వారీగా సిలబస్ అంశాలు.. ప్రిపరేషన్ గైడెన్స్.. రెండు గ్రూప్‌లుగా పరీక్షలు సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలను రెండు గ్రూప్‌లుగా నిర్వహించనున్నారు. ప్రతి దశలోనూ ప్రతి గ్రూప్‌లోనూ నాలుగు పేపర్లు చొప్పున.. ఇంటర్‌లో ఎనిమిది పేపర్లు, ఫైనల్‌లో ఎనిమిది పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు వంద మార్కులు కేటాయించగా.. విద్యార్థులు ప్రతి గ్రూప్‌లో ఒక్కో సబ్జెక్ట్‌లో 40 శాతం మార్కులు, ఓవరాల్‌గా యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
సీఏ ఇంటర్.. విజయం ఇలా..
రెండు గ్రూపులుగా జరిగే సీఏ ఇంటర్ పరీక్షల్లో.. ప్రతి గ్రూప్‌లోనూ రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లు(పేపర్–2, పేపర్–4, పేపర్–6, పేపర్–7) డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. 30 శాతం మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలకు(ఎంసీక్యూస్) సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
పేపర్–1 (అకౌంటింగ్–100 మార్కులు)..
ఈ పేపర్‌లో అకౌంటింగ్ స్టాండర్డ్స్‌పై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. అన్ని చాప్టర్‌లలోనూ ఒక బేసిక్ ప్రాబ్లమ్‌ను ఎంచుకుని ప్రాక్టీస్ చేయాలి. మిగతా ప్రాబ్లమ్స్‌లో ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపకరిస్తుంది. కాన్సెప్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్–కంప్లీట్ రికార్డ్స్, బ్రాంచ్ అకౌంట్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
పేపర్–2 (కార్పొరేట్ ‘లా’స్ అండ్
అదర్ ‘లా’స్–100 మార్కులు..
ముప్పై శాతం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడిగే ఈపేపర్‌లో.. కొత్త చాప్టర్లు, కొత్త సవరణలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అన్ని చాప్టర్లను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. ఇటీవల కాలంలో పరీక్షలో కంపెనీల చట్టానికి ప్రాధాన్యం పెరిగింది. ఆచరణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొత్త సిలబస్ ప్రకారం– కంపెనీ లాపై ఎక్కువ దృష్టి సారించాలి.
పేపర్–3 (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్–100 మార్కులు)..
అన్ని చాప్టర్‌లలోనూ థియరీ ప్రశ్నలపై, ఫార్ములాలపై పట్టు సాధించాలి. మెటీరియల్స్, లేబర్, ఓవర్‌హెడ్స్ వంటి ప్రాథమిక చాప్టర్లలో అవగాహన ఎంతో అవసరం. కాస్ట్ షీట్, యూనిట్ కాస్టింగ్, ఏబీసీ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఓవర్‌హెడ్స్, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ వంటి చాప్టర్ల విషయంలో అప్లికేషన్ అప్రోచ్‌తో సమస్యలు సాధన చేయాలి.
పేపర్–4 ట్యాక్సేషన్ (100 మార్కులు)..
ఇన్‌కమ్ ట్యాక్స్ అంశాలను నూతన ఫైనాన్స్ యాక్ట్‌కు అన్వయించుకుని అభ్యసనం చేయాలి. ఫైనాన్స్ యాక్ట్–2019పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిర్దిష్టంగా ఏదో ఒక మెటీరియల్‌కు పరిమితమై ఆ పుస్తకాన్నే చదవాలి. టోటల్ ఇన్‌కమ్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్‌లో పాత, కొత్త సిలబస్ ప్రకారం జీఎస్‌టీకి ప్రాధాన్య ఇవ్వాలి. ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌లోని అన్ని ప్రాబ్లమ్స్‌ను పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి.
పేపర్–5 (అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్–100 మార్కులు)..
అకౌంటింగ్ సబ్జెక్ట్ మాదిరిగానే అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్‌కు సన్నద్ధమవ్వాలి. అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ను తప్పనిసరిగా చదవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అమాల్గమేషన్ అండ్ ఇంటర్నల్ రీ–కన్‌స్ట్రక్షన్, కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, పార్ట్‌నర్‌షిప్ అకౌంట్స్ చాప్టర్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.
పేపర్–6 (ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్–100 మార్కులు)..
ఆడిటింగ్ స్టాండర్డ్స్ విషయంలో నిర్దిష్టంగా ఒక ప్రశ్నకు వర్తించే భాగం వరకు వాటిని ప్రస్తావిస్తే సరిపోతుంది. ఆడిటింగ్ స్టాండర్డ్ పేరు, నెంబర్‌ను మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి. కంపెనీ ఆడిట్ అండ్ ఆడిట్ రిపోర్ట్ చాప్టర్‌లోని ప్రాక్టికల్ ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ట్రూ ఆర్ ఫాల్స్ ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కొత్తగా కలిపిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
పేపర్–7 (ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్–100 మార్కులు)..
ఆబ్జెక్టివ్ కొశ్చన్స్, డెఫినిషన్స్, వ్యత్యాసాలు, తప్పు, ఒప్పు ప్రశ్నలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టితో చదవాలి. ఫలితంగా అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ఉండే ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో ప్రాక్టీస్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
పేపర్–8 (ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్
ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్–100 మార్కులు)..
థియరీ ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎఫ్‌ఎం వంటి చాప్టర్లలో థియరీ ప్రశ్నలు బాగా చదవాలి. ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ చాప్టర్లలో కాన్సెప్ట్స్‌పై స్పష్టత ఏర్పరచుకోవాలి. రిస్క్ అనాలిసిస్, లీజింగ్ అండ్ డెసిషన్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ విషయంలో ఫార్ములా ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి. అన్ని చాప్టర్లలోనూ ఇంట్రడక్షన్, డెఫినిషన్స్, ఫ్లో చార్ట్స్, గ్రాఫ్స్, టెక్నికల్ టర్మ్స్, అప్రాప్రియేట్ అసెంప్షన్స్, ఫార్ములా, ఎగ్జామ్‌పుల్స్, సైడ్ హెడింగ్స్‌పై దృష్టి పెట్టాలి.
పేపర్–1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్..
ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాప్టర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. బిజినెస్ కాంబినేషన్ అండ్ కార్పొరేట్ రీ–స్ట్రక్చరింగ్, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ వంటి చాప్టర్లలో కష్టమైన అంశాలను గుర్తించాలి. దీంతో తుది దశ ప్రిపరేషన్‌లో ముఖ్యాంశాలపైనే దృష్టి కేంద్రీకరించే ఆస్కారం లభిస్తుంది. ప్రతి చాప్టర్‌లోనూ ఒక బేసిక్ ప్రాబ్లమ్ విధానాన్ని తెలుసుకొని.. మిగతా ప్రాబ్లమ్స్‌లోని ముఖ్యాంశాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి చాప్టర్‌లోనూ కాన్సెప్ట్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
పేపర్–2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్..
ఈ సబ్జెక్ట్ కోసం ప్రత్యేకంగా ఒక నోట్ పుస్తకంలో ఫార్ములాలను పొందుపర్చుకోవాలి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ ఎక్స్‌పోజర్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ చాప్టర్లతోపాటు కొత్త చాప్టర్లు.. కార్పొరేట్ ఎవాల్యుయేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టార్టప్ ఫైనాన్స్ చాప్టర్లపైనా దృష్టి పెట్టాలి. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ పూర్తిగా ఫార్ములాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుగా దీన్ని పూర్తి చేయాలి.
పేపర్–3 అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్..
ఆడిటింగ్ స్టాండర్డ్స్‌కు సంబంధించి ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని చదవాలి. ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌లోని ప్రాక్టికల్ ప్రశ్నలు చదవాలి. ముందుగా ప్రొఫెషనల్ ఎథిక్స్‌ను పూర్తి చేయాలి. రోజుకో ఆడిటింగ్ స్టాండర్డ్ చొప్పున చదవాలి. వీలైతే ఫ్లో చార్ట్స్ వేసుకోవాలి. పరీక్ష కోణంలో ప్రాక్టికల్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. కంపెనీ ఆడిట్, ఆడిట్ రిపోర్ట్‌లపై అవగాహన అవసరం.
పేపర్–4 కార్పొరేట్ ‘లా’స్ అండ్.. ఎకనామిక్ ‘లా’స్
అపాయింట్‌మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ మీటింగ్స్ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. అదే విధంగా అపాయింట్‌మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ మేనేజీరియల్ పర్సనల్‌కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. చట్టాల్లో మార్పులు జరిగేటప్పుడు ప్రాధాన్యం ఉండే పెనాల్టీ ప్రొవిజన్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోవాలి.
పేపర్–5 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్ అండ్
పెర్‌ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్..
థియరీకి, కేస్ స్టడీ చాప్టర్లపై దృష్టి పెట్టాలి. మోడ్రన్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, డెసిషన్ మేకింగ్, ప్రైసింగ్ డెసిషన్స్, పెర్‌ఫార్మెన్స్ మెజర్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, డివిజినల్ ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ వంటి అంశాలు బాగా చదవాలి. మోడ్రన్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, డెసిషన్ మేకింగ్, ప్రైసింగ్ డెసిషన్స్, పెర్‌ఫార్మెన్స్ మెజర్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్‌లో థియరీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
పేపర్–6 ఎలక్టివ్ పేపర్..
సీఏ ఫైనల్ పరీక్షల్లో ఒక పేపర్‌ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. రిస్క్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషనల్, ఎకనామిక్ ‘లా’స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ పేపర్‌లలో ఏదో ఒక పేపర్‌ను అభ్యర్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ బుక్ విధానంలో జరిగే ఈ పేపర్ పరీక్షకు ఆయా ఎలక్టివ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి అన్ని పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
పేపర్–7 డైరెక్ట్ ట్యాక్స్ ‘లా’స్ అండ్.. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్..
ఈ పేపర్ కోసం నిర్దిష్టంగా ఒక స్టడీ మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. రివిజన్ సమయంలో సమ్మరీ మాడ్యూల్, స్టడీ మెటీరియల్ తప్పనిసరిగా చదవాలి. ఫైవ్ హెడ్స్ అంశాలు తప్పనిసరిగా చదవాలి. సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్‌కి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ రూపొందించుకుని సన్నద్ధమైతే వేగంగా రివిజన్ పూర్తి చేయొచ్చు.
పేపర్–8 ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ ‘లా’స్..
ఈ పేపర్‌లో ఎఫ్.టి.పి. చాప్టర్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే వీలుంది. కాబట్టి ఈ చాప్టర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు. థియరీకి, ప్రాబ్లమ్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ల్యాండ్ మార్క్ కేస్ ‘లా’స్‌ను పరీక్షల్లో తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకే రకమైన అంశాలను విభిన్న కోణాల్లో చదవాలి. ఈ పేపర్‌కు కూడా ఫాస్ట్‌ట్రాక్ మెటీరియల్‌తో సన్నద్ధమైతే వేగంగా పునశ్చరణ చేయొచ్చు.
పరీక్షల సన్నద్ధతకు సూచనలు..
అన్ని పేపర్లకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌లోని అన్ని చాప్టర్లలోని ప్రశ్నలన్నింటినీ క్షుణ్నంగా చదవాలి. కాన్సెప్ట్స్, ఫార్ములాస్, బేసిక్ ప్రిన్సిపుల్స్‌పై అవగాహన పొందాలి. సీఏ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్, మరేదైనా ఒక ప్రామాణిక మెటీరియల్ తప్పనిసరిగా చదవాలి. అదే విధంగా సీఏ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే సప్లిమెంటరీ మెటీరియల్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ట్యాక్స్‌కు సంబంధించి పేపర్లు చదివేటప్పుడు చట్టంలో వచ్చిన సవరణలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా చట్టాల్లో మార్పులను అప్‌డేట్ అవుతూ ప్రిపరేషన్ సాగించాలి. అదే విధంగా రివిజన్ టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్‌ను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు పేపర్లను రివిజన్ చేయాలి. సొంతగా ఫాస్ట్ ట్రాక్ నోట్స్ రూపొందించుకుంటే మేలు. అదే విధంగా ఇటీవల కాలంలోని సవరణలను తప్పనిసరిగా చదవాలి. అంతేకాకుండా రివిజన్ టెస్ట్ పేపర్స్, మాక్ టెస్ట్ పేపర్స్ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా అభ్యసనం సమయంలోనే వీలైనంత ఎక్కువ మోడల్ టెస్ట్‌లు రాయడం కూడా ఎంతో మేలు చేస్తుంది.
సీఏ ఇంటర్ పరీక్ష తేదీలు..
గ్రూప్–1: మే 22, 24, 27, 29
గ్రూప్–2: మే 31, జూన్ 2, 4, 6
సీఏ ఫైనల్ పరీక్ష తేదీలు..
గ్రూప్–1: మే 21, 23, 25, 28
గ్రూప్–2: మే 30, జూన్ 1, 3, 5
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 31 నుంచి ఏప్రిల్ 13
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.icai.org