చార్టర్డ్ అకౌంటెన్సీ ఆర్టికల్‌షిప్‌తో అనుభవంతోపాటు కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఐసీఏఐ ఇటీవల సీఏ ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు సంబంధించి జూన్ 30లోపు శిక్షణ ప్రారంభించేందుకు గడువును పొడిగించింది. ఈ నేపథ్యంలో.. ఆర్టికల్‌షిప్ ప్రాధాన్యం, ప్రయోజనాలు, ఆర్టికల్‌షిప్ సమయంలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం..
సీఏలో తొలి దశ.. కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ). ఇందులో విజయం సాధించిన విద్యార్థులు రెండో దశ ఐపీసీసీ పరీక్షలు రాస్తారు. ఇందులోని రెండు గ్రూపులు పూర్తి చేసినవారు లేదా ఏదైనా ఒక గ్రూపు ఉత్తీర్ణులైన విద్యార్థులు.. మూడేళ్ల వ్యవధి కలిగిన ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ అర్టికల్‌షిప్ పూర్తి చేసిన వారు లేదా ఆర్టికల్‌షిప్ చివరి ఆరునెలల్లో ఉన్న విద్యార్థులు మాత్రమే సీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు అర్హులు. సీఏ విద్యార్థులు భవిష్యత్తులో చేయబోయే విధులకు సంబంధించిన పరిజ్ఞానం, వృత్తినైపుణ్యం, ఆచరణాత్మకత తదితర అంశాలపై అవగాహన పొందేందుకు ఆర్టికల్‌షిప్ దోహదపడుతుంది.
ప్రయోజనాలు..
సీఏ విద్యను అభ్యసించే వారు థియరీతోపాటు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పొందడానికి ఆర్టికల్‌షిప్ ఉపయోగపడుతుంది. క్షేత్రస్థాయి నైపుణ్యాలను అలవర్చుకొని, కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దోహదపడుతుంది.
తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయి కార్యకలాపాల నిర్వహణలో ఏ విధంగా అన్వయించాలి అనేదానిపై ఆర్టికల్‌షిప్ ద్వారా అవగాహన వస్తుంది.
ఆర్టికల్‌షిప్ అనేది ప్రాక్టికల్ అనుభవాన్ని అందించే వేదిక. కాబట్టి నిబద్ధతతో దీన్ని పూర్తిచేసిన వారికి అన్ని అంశాలపై పూర్తిస్థాయి పట్టు ఏర్పడుతుంది. అంతేకాకుండా ఫైనల్ పరీక్షల్లో చక్కటి ప్రతిభ కనబర్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఇంకా చదవండి: part 2: ఆర్టికల్‌షిప్ ఎక్కడ చేయాలి.. ఎంపిక ఎలా చేయాలో తెలుసుకోండిలా..