సీఏ ఫైనల్స్‌కు ఇప్పటి నుంచే ప్రిపేర్.. పరిశీలనతోనే అవగాహన పెంచుకోండిలా..!
ఆర్టికల్‌షిప్ చేస్తూనే.. ఫైనల్ పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మొత్తం రెండున్నర లేదా రెండేళ్ల కాలంలో మొదటి ఏడాది కొన్ని సబ్జెక్టులు, రెండో ఏడాది కొన్ని సబ్జెక్టులు.. ఇలా ప్లాన్ ప్రకారం చదువుకోవాలి.
స్టయిపెండ్..
ప్రతి ఆడిట్ సంస్థ తమ వద్ద ఆర్టికల్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు స్టయిపెండ్ చెల్లిస్తుంది. ఇది ఐసీఏఐ నిబంధనల ప్రకారం లేదా అంతకుమించి కూడా ఉండొచ్చు. ఆర్టికల్‌షిప్ సమయంలో తల్లిదండ్రులపై ఆధారపడకుండా..ఈ స్టయిపెండ్ ఉపయోగపడుతుంది.
పరిశీలనతోనే అవగాహన..
ఆర్టికల్‌షిప్ సమయంలో శిక్షణ ఇచ్చే ఆడిట్ సంస్థలు విద్యార్థులతో వివిధ కంపెనీల ఆడిట్ పనులు చేయిస్తుంటాయి. ఆడిట్ చేసే సమయంలో ఆయా సంస్థలకు సంబంధించిన పుస్తకాలను ఎలా తయారు చేస్తున్నారు.. లావాదేవీల నిర్వహణ, వ్యాపార సూత్రాలు, వ్యాపార పద్ధతులు, తయారీ సంస్థ అయితే వస్తువుల తయారీలో వివిధ దశలపై అవగాహన పెంపొందించుకోవాలి.
ఇంకా చదవండి: part 1: చార్టర్డ్ అకౌంటెన్సీ ఆర్టికల్‌షిప్‌తో అనుభవంతోపాటు కలిగే ప్రయోజనాలు ఇవే..!