Skip to main content

తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే - 2017

వృద్ధి రేటులో వరుసగా మూడో ఏడాది జాతీయ సగటును అధిగమించిన తెలంగాణ రాష్ట్రం తొలిసారిగా రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదు కాగా రాష్ట్రం 10.1 శాతం వృద్ధి రేటు సాధించింది. వరుస కరువులతో 2015-16 వరకూ కుంగిపోయిన వ్యవసాయ రంగం 2016-17లో బాగా పుంజుకుంది. పరిశ్రమలు, విద్యుత్, వ్యాపారం, స్థిరాస్తి, సేవా రంగాలు పురోగతిని నమోదు చేశాయి. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌తో పాటు సామాజిక, ఆర్థిక సర్వే-2017ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మార్చి 13న శాసనసభకు సమర్పించారు. ఈ సందర్భంగా అన్నీ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే వివరాలు మీ కోసం....
2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2016-17లో రాష్ట్ర జీఎస్‌డీపీ(స్థిర ధరల వద్ద) విలువ రూ.4.64 లక్షల కోట్ల నుంచి రూ.5.11 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తంగా ప్రస్తుత ధరల ప్రకారం 2016-17లో రాష్ట్రం 13.7 శాతం వృద్ధితో రూ.6.54 లక్షల కోట్ల జీడీపీని నమోదు చేయనుంది.

Socio Economic Outlook 2017

Education News The Way Forward
Education News
Macroeconomic Trends and the Growth Trajectory
Education News Agriculture and Allied Activities
Education News Industries
Education News Services Sector
Education News Human Development Index
Education News Sustainable Development Goals
Education News Statistical Profile


స్థూల రాష్ట్ర ఉత్పత్తి (ప్రస్తుత ధరలతో)

2015-16 : రూ. 5,83,117 కోట్లు
2016-17 : రూ. 6,54,000 కోట్లు (13.7 శాతం వృద్ధి)

జిల్లాల జీఎస్‌డీపీ లెక్కలు
2015-16 లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు వరుసగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ 4 జిల్లాల మొత్తం జీఎస్‌డీపీ విలువ మొత్తం జీఎస్‌డీపీలో 52 శాతముంది. మొత్తం 31 జిల్లాల్లో అత్యల్ప జీఎస్‌డీపీ రూ.5,428 కోట్లతో కుమ్రం భీం జిల్లా అట్టడుగున ఉంది.

వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే ఉపాధి
రాష్ట్రంలో ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగమే అండగా నిలుస్తోంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 14.7 శాతమే అయినా 54 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోంది. జీఎస్‌డీపీలో 62 శాతం వాటా కలిగిన సేవల రంగంలో 28 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో సేవల రంగం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి 73 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో సేవల రంగంపై ఆధారపడి 64 శాతం జీవిస్తున్నారు.

వ్యవసాయంలో గణనీయమైన వృద్ధి
కరువుతో వరుసగా రెండేళ్ల పాటు రుణాత్మక (మైనస్) వృద్ధి నమోదు చేసిన వ్యవసాయం రంగం ఈ ఏడాది 26.3 శాతం వృద్ధి సాధించింది. 2012-13 తర్వాత వ్యవసాయ రంగంలో ఇదే అత్యధిక వృద్ధి రేటు.

తలసరి ఆదాయం రూ.1,58,360
ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలకు సూచిక అయిన తలసరి ఆదా యంలో రాష్ట్రం దూసుకుపోతోంది. 2015-16లో రూ.1,40,683గా ఉన్న ఈ సూచీ 2016-17లో 12.6% వృద్ధితో రూ.1,58,360గా నమోదైంది. 10.2 శాతం వృద్ధితో రూ.1,03,818కు చేరిన జాతీయ తలసరి ఆదాయం కన్నా ఇది ఎక్కువ.
2015-16 గణాంకాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.రెండు లక్షలకుపైగా నమోదైంది. సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు రూ.లక్షకు పైగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి.

జిల్లాలవారీగా తలసరి ఆదాయం
హైదరాబాద్ రూ.2,99,997 రంగారెడ్డి రూ. 2,88,408
సంగారెడ్డి రూ.1,69,481 మేడ్చల్ రూ.1,62,327
భద్రాద్రి రూ.1,23,112 సిద్దిపేట్ రూ.1,20,909
యాద్రాద్రి రూ.1,19,989 పెద్దపల్లి రూ.1,13,164
మెదక్ రూ.1,10,149 ఖమ్మం రూ.1,09,975
నల్లగొండ రూ.1,08,065 సూర్యపేట్ రూ.1,06,641
కరీంనగర్ రూ.1,01,224 ఆదిలాబాద్ రూ.98,819
మంచిర్యాల రూ.97,677 జయశంకర్ రూ.96,305
వరంగల్ రూరల్ రూ.96,076 నిజామాబాద్ రూ. 91,378
నిర్మల్ రూ.91,424 కుమ్రంభీమ్ రూ.89,947
జనగాం రూ.88,269 వికారాబాద్ రూ.85,865
గద్వాల్ రూ.85,183 సిరిసిల్ల రూ.84,593
మహబూబాబాద్ రూ.84,464 మహబూబ్‌నగర్ రూ.84,172
వనపర్తి రూ.83,196 నగర్‌కర్నూల్ రూ.81,147
వరంగల్ అర్బన్ రూ.79,753 కామారెడ్డి రూ.78,853
జగిత్యాల రూ.77,669

యువతలో ఐదింట ఒకరు నిరుద్యోగి
రాష్ట్రంలో నిరుద్యోగిత సగటు 2.7 శాతంగా ఉంది. ఇది పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 1.2 శాతంగా నమోదైంది. రాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉండటంపై ఆర్థిక,సామాజిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

మొత్తంగా రాష్ట్రంలోని 96 శాతం యువతకు ఎలాంటి సాంకేతిక విద్య లేదు. పనిచేస్తున్న యువతలో 44 శాతం వ్యవసాయం, 15 శాతం ఉత్పత్తి, 11 శాతం వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.

పనిచేసే వయసున్న జనాభాయే అధికం
సకుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 2.39 కోట్ల మంది ఉపాధి వివరాలను వెల్లడించారు. అందులో 8.3 లక్షల మంది ఎలాంటి ఉపాధి, ఉద్యోగం లేదని తెలపగా మరో 18.89 లక్షల మంది విద్యార్థులు, 17.7 లక్షల మంది గృహిణులు ఉన్నారు. 15-19 వయసు గల జనాభాలో 8.84 లక్షల మంది ఎలాంటి పనిచేయడం లేదు.

వృత్తులు, రంగాల వారీగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య
( సకుటుంబ సర్వే -2014 ప్రకారం )
రోజు కూలీ 36,17,275 వ్యవసాయ కూలీ 27,08,706
సొంత వ్యవసాయం 12,92,876 బీడీ కార్మికులు 4,57,827
డ్రైవర్లు 3,48,053 చిరు వ్యాపారులు 2,88,957
వలస కూలీలు 2,13,553 ఇతర వృత్తులు 1,17,815
చాకలి 91,383 గీత కార్మికులు 85,563
వడ్రంగి 75,648 ఐటీ 56,968
చేనేత కార్మికులు 56,371 కౌలు వ్యవసాయం 52,845
పాడి పెంపకం 47,458 క్షవర వృత్తి 42,751
చేపల పెంపకం 36,244 టైలర్ 30,680
బడా వ్యాపారం 26,364 స్వర్ణకారులు 25,779
పశు పెంపకం 25,080 కమ్మరి 18,841
యాచక 18,396 కళాకారులు 14,256
కుమ్మరి 11,539 షాప్ కీపర్లు 8,236
వాచ్‌మన్లు 6,705 ఇత్తడి పనులు 5,747
చర్మకారులు 5,545 గృహిణులు 17,70,711
విద్యార్థులు 18,89,825 నిరుద్యోగులు 8,36,340
నైపుణ్యం గల కార్మికులు 1,13,730 పారిశుద్ధ్య కార్మికులు 19,476
ప్రైవేటు సెక్యూరిటీ గార్డు 15,150
ఇతర దేశాల్లో పనిచేస్తున్న వారు 93,311
వివరాలు తెలపనివారు 85,51,380
(మొత్తం - 2,39,08,599)

పోస్టు గ్రాడ్యుయేట్లు 4 శాతం
సకుటుంబ సర్వే-2014 ప్రకారం రాష్ట్ర జనాభాలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), ఆపై విద్య అభ్యసించిన వారు 4 శాతమే. గ్రాడ్యుయేషన్ (డిగ్రీ స్థాయి) పూర్తి చేసినవారు 14 శాతం ఉన్నారు. 10 శాతం ఇంటర్మీడియట్, మరో 29 శాతం పదో తరగతి వరకు చదువుకున్నారు. 7 శాతం ప్రాథమిక విద్య పూర్తి చేయగా 2 శాతం మంది డిప్లొమా కోర్సులు చేశారు. మిగతావారు చదువుకోనివారు లేదా ప్రాథమిక విద్య పూర్తి చేయనివారు.

టీఎస్-ఐపాస్ ద్వారా 2 లక్షల మందికి ఉపాధి
నూతన పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ద్వారా 2016 జనవరి 24 వరకు రాష్ట్రంలో 3,327 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమలతో 2,12,033 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే 1,138 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా 405 పరిశ్రమల ఏర్పాటు చివరి దశలో ఉంది. అత్యధికంగా 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి.

రాష్ట్రంలో పరిశ్రమలు 11,068
దేశవ్యాప్తంగా 1,85,690 పరిశ్రమలు ఉండగా తెలంగాణలో 11,068 (5.69 శాతం) ఉన్నాయి. దేశంలోని అన్ని పరిశ్రమల్లో కోటి 35 లక్షల మంది ఉద్యోగులంటే వీరిలో తెలంగాణ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 7.5 లక్షలు (5.5 శాతం). కాగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం 2016-17లో రాష్ట్రంలో 8,618 పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. ఇందులో 632 (7 శాతం) యూనిట్లను పునరుద్ధరించేందుకు అవకాశాలు ఉండగా మిగతా వాటి పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చారు.

మిషన్ కాకతీయతో పెరిగిన భూగర్భ జలాలు
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చేపట్టిన చెరువుల మరమ్మతుల వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 2.55 మీటర్లు పెరిగాయి.

రాష్ట్ర రుణ ప్రణాళిక
  • రాష్ట్రంలో 2015-16లో మొత్తంగా రూ.78,776.4 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.1,36,855.7 (174 శాతం) కోట్లు ఇచ్చారు.
  • రూ.27,800 కోట్ల పంట రుణాల జారీ లక్ష్యంగా పెట్టుకోగా రూ.23,400 కోట్లు ఇచ్చారు.
  • 2016-17లో మొత్తం రూ.90,776 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇందులో రూ.29,101 కోట్లు (33 శాతం) పంట రుణాలున్నాయి.

తెలంగాణ గణాంకాలు
తెలంగాణ జనాభా 3,50,03,674
పురుషులు 1,76,11,633
మహిళలు 1,73,92,041
మొత్తం అక్షరాస్యత 2,06,96,778 (66.54%)
పురుషులు 1,17,01,726 (75.04%)
మహిళలు 89,95,049 (57.99)
స్త్రీ, పురుష నిష్పత్తి 988: 1,000
కుటుంబాలు 83,03,612
గ్రామీణ జనాభా 2,13,95,009
పట్టణ జనాభా 1,36,08,665
బాలలు 38,99,166
ఎస్సీలు 54,08,800 (15.45%)
ఎస్టీలు 31,77,940 (9.08%)
ఎస్సీ వసతి గృహాలు 875
ఎస్టీ వసతి గృహాలు 472
బీసీ వసతి గృహాలు 700
అంగన్‌వాడీ కేంద్రాలు 35,700
స్వయం సహాయక సంఘాలు 4,26,725
వ్యక్తిగత మరుగుదొడ్లున్న కుటుంబాలు 16,63,839
రక్షిత తాగునీటి సరఫరా వనరులు 1,85,147
విద్యుత్ గృహ కనెక్షన్లు 95,04,305
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 20,80,706
ప్రాథమిక పాఠశాలలు 21,948
ప్రాథమికోన్నత పాఠశాలలు 7,189
ఉన్నత పాఠశాలలు 11,333
కళాశాలలు 4,655
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 683
టెలిఫోన్ కనెక్షన్లు 5,10,070
ఆర్టీసీ బస్సులు 10,482
మొరం రోడ్లు 16,343 కి.మీలు
మట్టి రోడ్లు 18,235 కి.మీలు

జిల్లాల గణాంకాలు
  • రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందు జిల్లా సగటు జనాభా 37.89 లక్షలుగా ఉండేది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ (45.63 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (37.99 లక్షలు) తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉండేది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలకు తగ్గింది. దీంతో సగటు జనాభా జాబితాలో రాష్ట్రం 17వ స్థానానికి పడిపోయింది.
  • జన సాంద్రత పరంగా చూస్తే హైదరాబాద్‌లో చదరపు కిలోమీటర్‌కు సగటున 8,172 మంది ఉంటే, కొమ్రం భీం జిల్లాలో 106 మంది నివసిస్తున్నారు.
Published date : 16 Mar 2017 12:09PM

Photo Stories