PNB Notification 2024: 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. రాత పరీక్ష.. ఇలా
- పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఎస్‌వో కొలువులు
- నాలుగు విభాగాల్లో 1,025 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
- రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ముఖ్యమైంది. ఐబీపీఎస్ ద్వారా క్లర్క్స్, పీఓ పోస్ట్‌ల భర్తీ చేపట్టే పీఎన్‌బీ.. స్పెషలిస్ట్ పోస్టులకు మాత్రం సొంతంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. తాజాగా నాలుగు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 1,025 పోస్ట్‌లు
పీఎన్‌బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1,025 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్-క్రెడిట్ 1000 పోస్ట్‌లు, మేనేజర్-ఫారెక్స్ 15 పోస్ట్‌లు, మేనేజర్-సైబర్ సెక్యూరిటీ 5 పోస్ట్‌లు, సీనియర్ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ-5 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు
- పోస్ట్‌లను అనుసరించి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
- వయసు: క్రెడిట్ ఆఫీసర్‌కు 21-28 ఏళ్లు; ఫారెక్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ మేనేజర్‌కు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ పోస్ట్‌కు 27-38 ఏళ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి రిజర్వ్‌డ్ కేటగిరీ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి రెండంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. తొలుత రాత పరీక్ష ఉంటుంది. అందులో ప్రతిభ ఆధారంగా మలిదశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్ష.. ఇలా
తొలి దశలో రాత పరీక్షను రెండు విభాగాల్లో (పార్ట్-1, పార్ట్-2) 100 మార్కులకు చొప్పున నిర్వహిస్తారు. పార్ట్-1లో రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు; ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-25 మార్కులు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష ఉంటుంది. అదేవిధంగా పార్ట్-2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ పేరుతో సంబంధిత సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇలా మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు. పరీక్షకు లభించే సమయం రెండు గంటలు.
పర్సనల్ ఇంటర్వ్యూ
తొలిదశ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. పార్ట్-2లోని ప్రొఫెషనల్ సబ్జెక్ట్ విభాగంలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో చోటు సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో బ్యాంకింగ్ నాలెడ్జ్,అభ్యర్థులు ఎంచుకున్న విభాగానికి సంబంధించిన పరిజ్ఞానం, పని అనుభవం తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
తుది ఎంపిక
తుది నియామకాలు ఖరారు చేసే క్రమంలో.. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు; ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు పొందాలి.
వేతనాలు
- జేఎంజీఎస్-1కు రూ.36,000-రూ.63,840తో ప్రారంభ వేతన శ్రేణి ఉంటుంది.
- ఎంఎంజీఎస్-2కు రూ.48,170-రూ.69, 810 శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.
- ఎంఎంజీఎస్-3కు రూ.63,840-రూ.78,230 శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది.
విధులివే
- ఆఫీసర్ క్రెడిట్: బ్యాంక్ క్రెడిట్ విభాగాలు, కార్పొరేట్ బ్రాంచ్‌లు, ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్స్, ఫైనాన్స్ విభాగం, కార్పొరేట్ క్రెడిట్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- మేనేజర్-ఫారెక్స్: బ్యాంకుకు సంబంధించి ఏడీ బ్రాంచ్‌లు; బ్యాక్ ఆఫీస్‌లు/ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో ఫారెన్ ఎక్సే్ఛంజ్‌కు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- మేనేజర్, సీనియర్ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: బ్యాంకుకు సంబంధించిన ఆన్‌లైన్ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా.. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ సమర్థవంతంగా పనిచేసేలా నిరంతర పర్యేవక్షణ, నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీఎం స్థాయికి
స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా కొలువులో చేరిన వారు భవిష్యత్తులో జనరల్ మేనేజర్‌వరకూ పదోన్నతులు పొందే అవకాశముంది. సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్ట్‌లకు.. పనితీరు, ప్రతిభ, సర్వీసు ఆధారంగా పదోన్నతి లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఫిబ్రవరి 25.
- ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
- వెబ్‌సైట్: https://www.pnbindia.in/Recruitments.aspx
రాత పరీక్షలో రాణించేలా
రీజనింగ్
రీజనింగ్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
బేసిక్ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
అర్థమెటిక్‌పై పట్టుతో ఈ విభాగంలో రాణించొచ్చు. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా సాధన చేస్తే.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందొచ్చు. అదే విధంగా.. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా సాధన చేయాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్
ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం కోసం అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి.. బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను చదవాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: IDBI Bank Recruitment 2024: 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- PNB Notification 2024
- PNB Latest Notification 2024
- PNB Specialist Officer Recruitment 2024
- Bank Jobs 2024
- Specialist Officer Jobs
- bank exam syllabus
- Bank Exam Guidance
- bank exam exam pattern
- Bank Exam Preparation Tips
- Punjab National Bank
- latest notifications
- latest job notifications 2024
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications