Free Coaching for Group I & II: గ్రూప్స్ శిక్షణ ఎంపికకు రాత పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
రంపచోడవరం: సివిల్ సర్వీసెస్, గ్రూప్–1,2 ఉద్యోగాల శిక్షణకు నిర్వహించిన మొదటి లెవెల్‌లో ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్ 3న రెండో లెవెల్ పరీక్ష నిర్వహించనున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే తెలిపారు.
![written test for selection of groups training](/sites/default/files/images/2023/11/29/competitiveexams-1701253173.jpg)
నవంబర్ 28న ఆయన మాట్లాడుతూ మొదటి లెవెల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి వివరాలను రంపచోడవరం ఐటీడీఏ, వైటీసీ, చింతూరు ఐటీడీఏ, వైటీసీ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్
ఉచిత శిక్షణకు 449 మంది దరఖాస్తు చేయగా ఇందులో 422మంది అభ్యర్థులు మొదటి లెవెల్ పరీక్షకు హాజరయ్యారన్నారు. వీరిలో 150 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు.
రెండో లెవెల్ పరీక్షకు సంబంధించి వైటీసీలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటయన్నారు. వీటిని నవంబర్ 29, 30 తేదీల్లో అభ్యర్థులు తీసుకోవాలని పీవో సూచించారు.
Published date : 29 Nov 2023 03:49PM