Skip to main content

APPSC Groups Exams : గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌పై ఏపీపీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఈ విధంలోనే అవ‌కాశాలు..

One common general studies exam for 8 notifications in appsc   APPSC 2025 exam schedule release  Andhra Pradesh Public Service Commission job notifications  APPSC new policy announcement  Common Paper 1 for APPSC exams  General Studies and Mental Ability Paper in APPSC exams

సాక్షి ఎడ్యుకేషన్: గ‌తంలో జారీ చేసిన 8 వివిధ జాబ్ నోటిఫికేష‌న్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుద‌ల చేసింది. దీంతో, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సరి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే, తాజాగా.. మ‌రో కీల‌క విష‌యాన్ని ఏపీపీఎస్సీ వెల్ల‌డించింది. ఈ 8 పరీక్షల్లోనూ 'పేపరు 1' కింద జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌ ఉమ్మడిగా ఉందన్న విషయాన్ని ఏపీపీఎస్సీ గుర్తించారు.

Free coaching Group Exams: గ్రూప్స్‌ పరీక్షలకు, RRB, SSC, బ్యాంకింగ్‌ ఉద్యోగ పోటీ పరీక్షలకు నాలుగు నెలలపాటు ఉచితంగా శిక్షణ

ఇక‌ ఈ 8 పరీక్షలకు పేపర్ 1ను ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో, ఈ ప‌రీక్ష‌ను ఏప్రిల్‌ 28వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జనరల్ స్టడీస్‌ పేపర్ నిర్వహిస్తామని నిర్ణ‌యించి ప్ర‌క‌టించింది. ఒకే సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధతకు సమయం కూడా ఆదా అవుతుందని వివ‌రించింది. పైగా ప్రశ్నపత్రం రూపకల్పన, మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధ తెలిపారు.

1:100 నిష్పత్తిలో అవ‌కాశాలు..

ఉమ్మ‌డి ప‌రీక్ష విధానం ఒక‌లా ఉంటే, మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్‌ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్‌లో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. గ్రూప్‌ 2, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సతం 1:100 నిష్పత్తి విధానాన్ని అనుసరించారని కోరుతున్నారు. అలాగే, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో.. క్యారీఫార్వర్డ్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌పై పునఃపరిశీలన జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మహిళలకు రోస్టర్‌ పాయింట్లు కేటాయించారన్నారు. ఈ విధానంపై పునఃపరిశీలన జరిపి, పురుష అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Jan 2025 11:43AM

Photo Stories