APPSC: గ్రూపు–1 ప్రిలిమినరీ ఫలితాల వెల్లడి.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
జనవరి 8న ఇందుకు సంబంధించి రాతపరీక్షలు నిర్వహించారు. అయితే, ఏపీపీఎస్‌సీ చరిత్రలోనే రికార్డు వ్యవధిలో కేవలం 19 రోజుల్లో ఫలితాలు వెల్లడించారు. 2022 సెప్టెంబరు 30న ప్రభుత్వం గ్రూపు–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,26,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,06,473 మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది జనవరి 8న రాతపరీక్షకు హాజరయ్యారు.
చదవండి: ఏపీపీఎస్సీ | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మొత్తం 6,455 మందిని ఏపీపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తూ అందుకు సంబంధించిన ఫలితాలను జనవర 27న ప్రకటించింది. మరోవైపు.. ఏప్రిల్ 23 నుంచి వారం రోజులపాటు జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షల తుది కీ వివరాలు www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్‌కుమార్ జనవరి 27న ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
వేగంగా ఉద్యోగ నియామకాలకు సీఎం ఆదేశాలు
ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి లోనుకాకుండా నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తికావాలని బోర్డు చైర్మన్‌కు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన సూచనలు చేశారని ఏపీపీఎస్‌సీ బోర్డు సభ్యులు సలాం బాబు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీపీఎస్‌సీ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో రాతపరీక్షల ఫలితాలు ప్రకటించడం ఎప్పుడూ జరగలేదని ఆయన వివరించారు.
చదవండి: APPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కీలక మార్పులు
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్..
23–04–2023 : |
పేపర్ ఇన్ తెలుగు |
24–04–2023 : |
పేపర్ ఇన్ ఇంగ్లీషు |
25–04–2023 : |
పేపర్–1, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై జనరల్ ఎస్సే |
26–04–2023 : |
పేపర్–2, హిస్టరీ, కల్చరల్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ |
27–04–2023 : |
పేపర్–3, పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ |
28–04–2023 : |
పేపర్–4, ఎకానమీ, డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ |
29–04–2023 : |
పేపర్–5, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సంబంధిత అంశాలు |