Skip to main content

గ్రామ, వార్డు సచివాలయాల్లో 6,500 మందికి ప్రొబేషన్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మరో 6,500 మంది ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 6,500 మందికి ప్రొబేషన్‌
గ్రామ, వార్డు సచివాలయాల్లో 6,500 మందికి ప్రొబేషన్‌

జూన్‌ నెలకు ముందు APPSC నిర్వహించిన డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు హాజరై, జూలై నెలలో వెల్లడైన ఫలితాల్లో అర్హత సాధించిన ఈ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచే పెరిగిన పే స్కేళ్లతో కూడిన వేతనాలను వారికి అందజేస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా స్పష్టించడంతో పాటు కేవలం నాలుగు నెలల్లోనే వాటి భర్తీ కూడా పూర్తి చేశారు. 2019 డిసెంబరునాటికి తొలి విడత ఉద్యోగాల భర్తీ పూర్తయింది. తొలి విడతలో మిగిలిపోయిన కొద్ది ఖాళీలను కూడా 2020 నవంబరు – 2021 జనవరి మధ్య రెండో విడతగా ప్రభుత్వం భర్తీ చేసింది. నిబంధనల ప్రకారం.. మొదటి విడతలో ఉద్యోగాలు పొంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిలో అర్హత ఉన్న అందరికీ ఒకేసారి 2022 జూన్‌ 30వ తేదీన ప్రొబేషన్‌ ఖరారు చేసింది. జూలై నెల (ఆగస్టు 1వ తేదీన అందుకునే వేతనం) నుంచి పే స్కేళ్లతో కూడిన వేతనాలు అందజేసింది. మొదటి విడతలో ఉద్యోగాలు పొంది రెండేళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ, నిబంధనల ప్రకారం డిపార్టమెంట్‌ పరీక్ష పాసవడంలో ఆలస్యమైన 6,500 మందికి తాజాగా ప్రొబేషన్‌ ఖరారు చేసింది.

చదవండి: 

Jobs: రవాణా శాఖకు కొత్తగా 95 పోస్టులు

APPSC: గెజిటెడ్, నాన్‌గెజిటెడ్‌.. పరీక్షల తేదీలు ఇవే..
APPSC: ఏఈ పోస్టులకు ఎంపికైనవారి జాబితా విడుదల
APPSC: జూనియర్‌/కంప్యూటర్‌ అసిస్టెంటు పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల
Published date : 10 Sep 2022 03:00PM

Photo Stories