Skip to main content

AP Grama Ward Sachivalayam Employees Toilet Photos Duty : ఏపీ గ్రామ‌/వార్డు సచివాలయాల ఉద్యోగులకు మ‌రో ప‌ని అప్పగింత..!

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఏపీ గ్రామ‌/వార్డు సచివాలయాల‌ ఉద్యోగుల‌ను ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఏదో విధంగా ఇబ్బంది పెట్టెలా ప్ర‌వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు చూస్తుంటే.. గ్రామ‌/వార్డు సచివాలయాల‌ ఉద్యోగుల‌ను టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.
AP Grama Ward Sachivalayam Employees Extra Duty

ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లలో పరిశుభ్రత అమలుకు సంబంధించిన ఫొటోలను తీసి, వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది.

☛➤ AP Grama Ward Sachivalayam Employees : ఏపీ గ్రామ‌/వార్డు సచివాలయాల‌ ఉద్యోగుల‌కు మ‌రో కొత్త ట్విస్ట్..!

ప్రతి సోమ, గురువారాల్లో..
సచివాలయాల్లో పనిచేసే ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వార్డు ఎడ్యుకేషన్‌ కార్యదర్శి వారంలో ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలను తీసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్‌ యాప్‌లో వారికి లాగిన్ సదుపాయం కల్పించారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు ఇకపై సచివాలయ ఉద్యోగులకు అనుమతిస్తారు.

☛➤ APPSC Jobs Notifications 2024 Mistakes : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 సహా 21 నోటిఫికేషన్లు.. ఈ పరీక్షలకు కనీసం తేదీలు కూడా..

బుధ, గురువారాల్లో మాత్రం..
బుధ, గురువారాల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల చైర్మన్‌తో పాటు సభ్యులు కూడా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఈ మేరకు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.

ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యా శాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లోలో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఈ ఆదేశాలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

➤☛ AP Grama Ward Sachivalayam Employees New Rules 2024 : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కొత్త డిమాండ్స్ ఇవే.. మాకు ఇవి కావాల్సిందే..!

Published date : 20 Aug 2024 08:07PM

Photo Stories